Terrorist Attack: జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల దాడి.. 10 మంది మృతి జమ్ము కశ్మీర్లోని రియాసి జిల్లాలో ఉగ్రవాదుల దాడి జరిగింది. యాత్రికుల బస్సుపై ముష్కరులు కాల్పులు జరపడంతో బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 10 మంది యాత్రికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 33 మందికి తీవ్ర గాయాలయ్యాయి. By B Aravind 09 Jun 2024 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి Terrorist Attack On Bus: ప్రధాని మోదీ ప్రమాణస్వీకారం వేళ జమ్మూ కశ్మీర్లో (Jammu Kashmir) ఉగ్రవాదుల దాడి జరిగింది. యాత్రికుల బస్సుపై ముష్కరులు కాల్పులు జరిపారు. దీంతో బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 10 మంది యాత్రికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 33 మందికి తీవ్ర గాయాలయ్యాయి. రియాసి అనే జిల్లాలో ఈ ఘటన జరిగింది. రాన్సు నుంచి ఖత్రాకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. సమాచారం మేరకు పోలీసులు, భద్రత బలగాలు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. Also Read: నరేంద్ర మోదీ అనే నేను.. #terrorist-attack #telugu-news #jammu-kashmir #national-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి