ఏపీ పాలిటిక్స్ లో కీకలపరిణామాలు చోటు చేసుకోనున్నాయి అని తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్ ముందస్తు ఎన్నికలను వెళ్ళే యోచనలో ఉన్నారని దానికి సంబంధించి ఈరోజు పార్టీ నేతలతో సమావేశం కానున్నారని సమాచారం. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు జగన్ కీలక సమావేశం నిర్వహిస్తారని చెబుతున్నారు. దీనికి పార్టీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు,ఇన్‌ఛార్జులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, రీజినల్ కోఆర్డినేటర్లు హాజరుకానున్నారు. ఇందులో ముఖ్యంగా రెండు అంశాలు చర్చకు రానున్నాయి. ఒకటి ఏపీలో ముందస్తు ఎన్నికలు, రెండు గడపగడపకూ మన ప్రభుత్వం గురించి జగన్ నిర్ణయాలు తీసుకోనున్నారు.
ప్రస్తుతం చంద్రబాబు అరెస్ట్, ఏపీ పాలిటిక్స్ లో మార్పులకు తగ్గట్టుగా సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలనుకుంటున్నారని వినిపిస్తోంది. అలా వెళ్ళేట్టు అయితే ఎవరెవరికి టికెట్లు ఇస్తారన్న దాని గురించి కూడా ఈరోజు భేటీలో నిర్ణయించనున్నారు. సుమారు 20 నుంచి 30 మంది భవితవ్యం ఈరోజు తేలనుంది. పని తీరు సరిగ్గా లేని ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వలేమని జగన్ చెప్పనున్నారని టాక్ వినిపిస్తోంది. దీంతో పాటూ అసలు ముందస్తు ఎన్నికలు ఉంటాయా లేదా అనే దాని మీద కూడా ఆయన క్లారిటీ ఇవ్వనున్నారు.
ఎన్నికలకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే అన్ని రెడీ చేసిపెట్టుకున్నారని తెలుస్తోంది. ఎమ్మెల్యేల పని తీరు, ఎవరెవరు ఈఐదేళ్ళల్లో ఏం చేశారు అన్న రిపోర్ట్ లు ఆయన దగ్గర ఉన్నాయని తెలుస్తోంది. గడపగడపకు మన ప్రభుత్వం, పీకే టీమ్ సర్వే, ఇతర సర్వేల ఆధారంగా..ఎమ్మెల్యేల పనితీరుపై రిపోర్టు సిద్ధం చేసుకున్నారని చెబుతున్నారు. దీన్ని బట్టి సుమారు 30 మంది ఎమ్మెల్యేలకు ఈ సారి టికెట్లు ఇవ్వకపోవచ్చని సమాచారం. దీంతో ఎవరి టిక్కెట్ ఊడుతుందోనని ఎమ్మెల్యేల్లో టెన్షన్ పెరిగిపోయింది. మధ్యాహ్నం సమావేశంలో ఏ బాంబ్ పేలుతుందో అని గుబులుగా ఉన్నారు.
ఇది కూడా చదవండి: చంద్రబాబుకు షాక్.. కస్టడీ, బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా?
ఎక్కడ చూసినా వైరల్ ఫీవర్ కేసులే.. లక్షణాలు, రావడానికి కారణాలు ఏంటో తెలుసా?