Viral Fevers: దేశ వ్యాప్తంగా డెంగ్యూ, ఇతర వైరల్ ఫీవర్స్ టెన్షన్ పెడుతున్నాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని వైరల్ ఫీవర్స్ వణికిస్తున్నాయి. సీజనల్ వ్యాధుల కాలం కావడంతో డెంగ్యూ దోమలు మరింత ఎక్కువగా వ్యాప్తి చెంది జనాలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఒళ్ళు నొప్పులు, జ్వరంతో జనాలు అల్లాడిపోతున్నారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే వైరల్ ఫీవర్ అని రిపోర్ట్ వస్తోంది. రాష్ట్రంలోని డెంగ్యూ కేసుల్లో 40శాతం హైదరాబాద్‌లో నమోదవుతున్నాయి. దీంతో బెంబేలెత్తిపోతున్నారు సిటీ జనాలు.
పూర్తిగా చదవండి..Viral Fevers: ఎక్కడ చూసినా వైరల్ ఫీవర్ కేసులే.. లక్షణాలు, రావడానికి కారణాలు ఏంటో తెలుసా?
వాతావరణం చాలా ఎక్కువగా మార్పులు చెందుతోంది. వర్షాలు ఎప్పటికప్పుడు గట్టిగా పడుతున్నాయి. ఎండలకు ఎండలూ అలాగే ఉన్నాయి. దీంతో దేశంలో వైరల్ ఫీవర్స్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఈ ఎఫెక్ట్ తెలుగు రాష్ట్రాల మీద కూడా పడింది. చాపకింద నీరులా డెంగ్యూ కేసులూ పెరుగుతున్నాయి. వైరల్ ఫీవర్స్ హైదరాబాద్‌ను వణికిస్తున్నాయి. జ్వరాల బారిన పడి ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతుంది.
Translate this News: