కేంద్రం కొత్త స్కీమ్.. ఒక్కొక్కరికి రూ. 60 వేలు..! కేంద్ర ప్రభుత్వం ఇటీవల ‘పీఎం ఇంటర్న్‌షిఫ్ ప్రోగ్రామ్’ కొత్త స్కీమ్‌ను ప్రకటించింది. దీనికి సెలక్ట్ అయిన అభ్యర్థులకు ఒక్కొక్కరికి నెలకు రూ.5000 చొప్పున సంవత్సరానికి రూ.60,000 స్టైఫండ్ అందించనున్నారు. డిసెంబర్ నుంచి ఇంటర్న్‌షిప్‌లు ప్రారంభించనున్నారు. By Seetha Ram 07 Nov 2024 in నేషనల్ జాబ్స్ New Update షేర్ చేయండి కేంద్ర ప్రభుత్వం ఇటీవల 2024-25 పూర్తి స్థాయి బడ్జెట్‌లో ‘పీఎం ఇంటర్న్‌షిఫ్ ప్రోగ్రామ్’ కొత్త స్కీమ్‌ను ప్రకటించింది. యువతలో నైపుణ్యాన్ని పెంపొందించి, వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. దీంతో ఈ ‘పీఎం ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్’కు సెలక్ట్ అయిన అభ్యర్థులకు ఒక్కొక్కరికి నెలకు రూ.5000 చొప్పున సంవత్సరానికి రూ.60,000 స్టైఫండ్ అందించనున్నారు. Also Read : ట్రేడింగ్ పేరుతో స్కాం.. హైదరాబాద్ ఐటీ ఉద్యోగికి రూ.2.29 కోట్ల టోకరా 500 సంస్థల్లో దాదాపు కోటి మందికి నైపుణ్యాలు కాగా ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే.. రానున్న ఐదు ఏళ్లలో టాప్ 500 సంస్థల్లో దాదాపు కోటి మందికి నైపుణ్యాలు కల్పించడం. దీనిని రూ.800 కోట్ల ఖర్చుతో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించింది. వచ్చే నెల అంటే డిసెంబర్ నుంచి ఇంటర్న్‌షిప్‌లు అందివ్వనున్నారు. Also Read : సీఎం రేవంత్‌పై కేసు పెట్టాలని పిటిషన్! అందువల్ల ఆసక్తిగల అభ్యర్థులు వెబ్‌సైట్లో అప్లై చేసుకోవలసి ఉంటుంది. అక్కడే పూర్తి వివరాలు అందించారు. ఇక నెల స్టైఫండ్‌లో ప్రభుత్వం రూ.4500 చెల్లిస్తుండగా.. శిక్షణ అందించే ఇండస్ట్రీ రూ.500 చెల్లిస్తుంది. మొత్తం రూ.5000 స్టైఫండ్ అందుకోవచ్చు. 📍కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం ఇంటర్న్‌షిప్ పథకం గురించి తెలుసుకోండి❕🔘500 అగ్రగామి కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ అవకాశాలు🔘ఐదేళ్లలో కోటి మందికి ఇంటర్న్‌షిప్ కల్పించడం లక్ష్యం#PMInternshipscheme pic.twitter.com/Tyr3JCFRla — PIB in Telangana 🇮🇳 (@PIBHyderabad) November 7, 2024 Also Read : 'అమరన్' సక్సెస్ మీట్.. నితిన్ హిట్ సాంగ్ ను తెలుగులో పాడిన శివకార్తికేయన్ ఇక ఇంటర్న్‌షిప్‌లో చేరే వారికి వ్యక్తిగత బీమా ఉంటుంది. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వ బీమా పథకాల ద్వారా ఇన్సూరెన్స్ కల్పించనున్నారు. దీనికోసం అప్లై చేసుకోవాలని ఆసక్తి ఉన్న వారు 21 ఏళ్ల నుంచి 24 ఏళ్ల వయస్సు మధ్య ఉండాలి. ఇక విద్యార్హత విషయానికొస్తే.. SSC పాసైన అభ్యర్థులు, ఐటీఐ, పాలిటెక్నిక్, బీఎస్సీ, బీఫార్మసీ, బీఏ, బీబీఏలో ఉత్తీర్ణులై ఉండాలి. నవంబర్ 10వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలి. Also Read : నాని - శ్రీకాంత్ ఓదెల మూవీకి డిఫరెంట్ టైటిల్.. అస్సలు ఉహించలేదే #pm-internship-program-scheme #job-notification #latest-jobs-telugu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి