వాసి వాడి తస్సాదియ్యా..గాల్లో ఎగిరే కెమెరా ఫోన్ వచ్చేసింది, వెరీ చీప్! ప్రముఖ టెక్ బ్రాండ్ రెడ్ మీ తాజాగా సరికొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. అధునాతన ఫీచర్లతో 'ఫ్లయింగ్ కెమెరా 5జీ" ఫోన్ ను రిలీజ్ చేసింది. దీనిని కేవలం రూ.20 వేల లోపే తీసుకొచ్చింది. By Seetha Ram 07 Nov 2024 in బిజినెస్ Latest News In Telugu New Update షేర్ చేయండి ప్రస్తుతం దేశ వ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ల హవా కొనసాగుతోంది. ఒకప్పుడు భారత మార్కెట్ స్థానం ఎక్కడో ఉండేది.. కానీ ఇప్పుడు దూసుకుపోతోంది. రోజుకు పదుల సంఖ్యలో మొబైల్ ఫోన్లు భారత మార్కెట్ లాంచ్ అవుతున్నాయి. దీంతో పాటు ఫోన్ ప్రియులను అట్రాక్ట్ చేసేందుకు కంపెనీలు సైతం కొత్త కొత్త టెక్నాలజీలను ఫోన్లలో అందిస్తున్నాయి. పోటీ పడి మరీ మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా తమ ఫోన్లలో అధునాతన ఫీచర్లను అందిస్తున్నాయి. ఇవాళ ఒక అద్భుతమైన టెక్నాలజీతో కొత్త ఫోన్ మార్కెట్ లోకి వచ్చిందంటే రేపటికి దానికి మించిన ఫోన్ కళ్లు చెదిరే ఫీచర్లతో వచ్చేస్తుంది. తాజాగా అలాంటి ఒక ఫీచర్ తోనే సరికొత్త ఫోన్ మార్కెట్ లో దర్శనమిచ్చింది. also read: ట్రేడింగ్ పేరుతో స్కాం.. హైదరాబాద్ ఐటీ ఉద్యోగికి రూ.2.29 కోట్ల టోకరా Flying Camera phone ప్రముఖ టెక్ బ్రాండ్ రెడ్ మీ ఆహా, ఓహో అనిపించే సరికొత్త స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. అది అలాంటి ఇలాంటి ఫోన్ కాదు.. ఏకంగా ఫ్లయింగ్ కెమెరా ఫోన్. అవును మీరు విన్నది నిజమే. సాధారంగా వివాహ వేడుకలు, ఉత్సవాలు తదితర ఈవెంట్లకు డ్రోన్ కెమెరాలను ఉపయోగిస్తున్నారు. అయితే ఇప్పుడు వాటితో సంబంధం లేకుండా రెడ్ మి సరికొత్త ఫోన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. also read: సీఎం రేవంత్‌పై కేసు పెట్టాలని పిటిషన్! ఈ రెడ్ మి ఫ్లయింగ్ కెమెరా 5జీ మొబైల్ కేవలం రూ.20,000 కంటే తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది అద్భుతమైన కెమెరా, బలమైన పెర్ఫార్మెన్స్ ను కలిగి ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఈ రెడ్ మి ఫ్లయింగ్ కెమెరా 5జీ ఫోన్ డిజైన్ చూడ్డానికి చాలా బాగుంది. also read: 'అమరన్' సక్సెస్ మీట్.. నితిన్ హిట్ సాంగ్ ను తెలుగులో పాడిన శివకార్తికేయన్ దీని స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. ఇది 6.7 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లేను కలిగి ఉంది. అలాగే 2400*1080 పిక్సెల్ ల రిజల్యూషన్ తో వచ్చింది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ ను కలిగి ఉంది. ఇంకా గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షాన్ ను కలిగి ఉంది. ప్రాసెసర్ విషయానికొస్తే.. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 1200 చిప్ సెట్ తో పనిచేస్తుంది. 180 గ్రాముల బరువు కలిగిన ఈ ఫోన్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం ఐపీ68 రేటింగ్ ను కలిగి ఉంది. also read: నాని - శ్రీకాంత్ ఓదెల మూవీకి డిఫరెంట్ టైటిల్.. అస్సలు ఉహించలేదే ఇది మూడు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. అందులో 4/64 జీబీ వేరియంట్, 6/128జీబీ వేరియంట్, 8/256 జీబీ వేరియంట్ లు ఉన్నాయి. ఇక కెమెరా విషయానికొస్తే.. ఇది 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. అంతేకాకుండా 48వాట్ పాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 4500 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఇది అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ద్వారా కొనుక్కోవచ్చు. #redmi #new-mobiles #tech-news-telugu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి