హైదరాబాద్ లో జాన్వీ కపూర్ ప్రత్యేక పూజలు.. వైరలవుతున్న ఫొటోలు బాలీవుడ్ నటి జాన్వీకపూర్ తాజాగా హైదరాబాద్‌లోని మధురానగర్ ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఆమెకు తీర్థప్రసాదాలు అందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతున్నాయి. By Anil Kumar 07 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ కు తల్లి శ్రీదేవి లాగే దైవ భక్తి ఎక్కువ అనే విషయం తెలిసిందే. ఆమె తరుచూ ఫ్యామిలీతో తిరుమలకు వెళ్తూ ఉంటుంది. తెలుగు సాంప్రదాయ పద్ధతిలోనే మొక్కు తీర్చు కుంటుంది. అయితే తాజాగా ఈ హీరోయిన్ హైదరాబాద్ లోని మధురానగర్ ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చింది. Also Read :యోగ టీచర్ నుంచి సినీ ఇండస్ట్రీని శాసించే స్థాయికి.. అనుష్క సినీ జర్నీ అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించింది. అర్చకులు ఆమెకు తీర్థప్రసాదాలు అందించారు. జాన్వీ హైదరాబాద్ వచ్చిందనే విషయం తెలిసి పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకున్నారు. ఆమెతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతున్నాయి. Also Read : వైసీపీకి మాజీ మంత్రి రాజీనామా!.. క్లారిటీ మధురానగర్లో నటి జాన్వీ కపూర్ సందడి..మధురానగర్లోని ఆంజనేయస్వామి ఆలయంలో నటి జాన్వీ కపూర్ పూజలు చేశారు. దాదాపు అరగంట పాటు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.#JahnaviKapoor #RC16 pic.twitter.com/Si9bz9monH — Narendra News (@Narendra4News) November 7, 2024 ఇక 'దేవర' సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే ఎన్టీఆర్ లాంటి టాప్ స్టార్ తో నటించే ఛాన్స్ అందుకొని బ్లాక్ బస్టర్ సక్సెస్ సొంతం చేసుకుంది. ప్రెజెంట్ ఈ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది. త్వరలోనే రామ్ చరణ్ తో 'RC16' మూవీ షూటింగ్ లో జాయిన్ కానుంది. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతుంది. తెలుగులో జాన్వీకి ఇది రెండో పాన్ ఇండియా మూవీ కావడం విశేషం. Also Read : డోనాల్డ్ ట్రంప్ గెలవడానికి ముఖ్య కారణాలు ఇవే... అమీర్ పేట్ - వెంగళరావు నగర్లోని ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన సినీ నటి జాన్వీ కపూర్. pic.twitter.com/r8AQQKUDqn — Telugu Scribe (@TeluguScribe) November 7, 2024 Also Read : కమల్ హాసన్ కు మాత్రమే సాధ్యమైన ఈ రికార్డుల గురించి తెలుసా? #bollywood #tollywood #devara #janhvi-kapoor మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి