/rtv/media/media_files/2025/05/04/MH3qIJXNOUg0GuTutsB5.jpg)
AP Crime
Wife killed husband : కాకినాడ జిల్లా పిఠాపురం గొల్లప్రోలు మండలం చేబ్రోలు బైపాస్ రోడ్ లో 2 నెలలు క్రితం గుర్తు తెలియని వ్యక్తి హత్య కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు.మృతుడు అనకాపల్లి జిల్లా యలమంచిలి ధర్మవరంకు చెందిన తంగేళ్ళ లోవరాజు (37) గా గుర్తించారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణంగా తేల్చిన పోలీసులు... పూర్తి వివరాలను జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మీడియా ముందు వెల్లడించారు.
Also Read : జానులిరి మరో షాకింగ్ వీడియో.. లవర్ దిలిప్ వీడియో రిలీజ్ చేసిన క్షణాల్లోనే రియాక్షన్
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అనకాపల్లి జిల్లా యలమంచిలి ధర్మవరంకు చెందిన తంగేళ్ళ లోవరాజు, శ్యామల భార్యభర్తలు. లోవరాజు స్థానిక ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు. అయితే భార్య శ్యామల వరుసకు భావ అయ్యే యలమంచిలికి చెందిన మోహన్ తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలిసి పలుమార్లు భార్యను మందలించాడు లోవరాజు. దీంతో భర్తపై కోపం పెంచుకున్న శ్యామల భర్త అడ్డు ఎలాగైన తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా ఫిబ్రవరి 28న ఫార్మా కంపెనీలో పని చేసి ఇంటికి వచ్చిన లోవరాజుని పథకం ప్రకారం హత్య చేశారు. సర్జికల్ బ్లేడు తో ప్రియుడు అతని స్నేహితుడితో కలిసి మెడపైన, గుండెల్లో పొడిచి పొడిచి హత్య చేసింది శ్యామల. అనంతరం కారు డిక్కీలో మృత దేహాన్ని పెట్టి 80 కిలోమీటర్ల దూరం తీసుకువచ్చి రోడ్డు పక్క పొదల్లో వడవేశారు.పిఠాపురంలోని గొల్లప్రోలు మండలం చేబ్రోలు బైపాస్ రోడ్ లో మృతదేహన్ని పడేసి వెళ్లిపోయారు. మార్చి 3న అనుమానస్పద మృతదేహన్ని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు.
Also Read : మంచితనం నటిస్తారు.. ఇండస్ట్రీపై చిర్రెత్తిపోయిన హాట్ బ్యూటీ!
కొడుకు కనిపించకపోవడంతో కోడలిని నిలదీసిన లోవరాజు తల్లి కళావతి... అయితే పాత కేసులో పోలీసుల తీసుకువెళ్లారని శ్యామల సమాధానమిచ్చింది. కాగా ఇంట్లో రక్తపు మరకల చూసి కోడలిని అత్త నిలదీయగా ఎలుకను పిల్లి చంపిందని తప్పించుకునే ప్రయత్నం చేసింది.రెండు నెలల్నుంచి కొడుకు కనిపించకపోవడంతో..ఎటో వెళ్లుంటాడు వస్తాడని ఎదురుచూసింది తల్లి కళావతి. అయితే కోడలి ప్రవర్తనపై అనుమానం వచ్చిన కళావతి కీడు శంకించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతిని రాగి కడియం,ఎర్ర తాడు తల్లి కళావతికి గుర్తించడంతో మిస్టరీ వీడింది.
Also Read : నేనలా అనలేదు.. వివాదంపై విజయ్ దేవరకొండ క్లారిటీ!..
లోవరాజు తల్లి నుండి పూర్తి వివరాలు సేకరించి.. కోడలు శ్యామలను అదుపులో తీసుకుని విచారించగా హత్య సంఘటన వెలుగు చూసింది. తన ప్రియుడు మోహన్, అతని స్నేహితుడు గంగాధరతో కలిసి హత్య చేసి కారులో తీసుకువచ్చి పడవెసినట్లుగా విచారణలో వెల్లడించడంతో ఆ తల్లి గొల్లుమంది.పోలీసులు ముగ్గురిని రిమాండ్ కు తరలించి కారుని స్వాధీనం చేసుకున్నట్లు కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ వెల్లడించారు.
ఇది కూడా చదవండి: ఉదయం ఈ తప్పులు చేస్తే థైరాయిడ్ మందులు వేసుకున్నా లాభం ఉండదు