janulyri: జానులిరి మరో షాకింగ్ వీడియో.. లవర్ దిలిప్ వీడియో రిలీజ్ చేసిన క్షణాల్లోనే రియాక్షన్

జానులిరి మరో వీడియో రిలీజ్ చేసింది. తాను త్వరలో కొత్త జీవితం మొదలు పెట్టబోతున్నట్లు అందులో తెలిపింది. తనపై వస్తున్న ట్రోల్స్‌ గురించి ఆలోచించి డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానని పేర్కొంది. ఇప్పుడు తన కొడుకు తాను చాలా సంతోషంగా ఉన్నాం అంటూ చెప్పుకొచ్చింది.

New Update
Janulyri news

Janulyri news

యూట్యూబ్‌లో ఫోక్ సాంగ్  వీడియోలతో ఫుల్ పాపులరైన డాన్సర్ జాను లిరి.. ఫోక్ సింగర్ దిలిప్ దేవ్‌గన్‌తో ప్రేమలో ఉందని.. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ నెట్టింట జోరుగా ప్రచారం సాగింది. వీటిపై స్పందించిన జాను లిరి ఏడుస్తూ ఒక వీడియో షేర్ చేసింది. ‘‘ఎప్పుడు చూసినా జాను లిరి రెండో పెళ్లి అని థంబ్ నెయిల్స్ పెడుతున్నారు. మీకు మాట్లాడుకోవడానికి ఏ టాపిక్ లేదా.. నా పర్సనల్ లైఫ్ గురించి మీకు ఎందుకు..?

Also Read:రేపు ఈ 3 వస్తువులను తాకితే మీ లైఫ్ ఛేంజ్.. కష్టాలు పరార్.. ఆ వస్తువుల లిస్ట్ ఇదే!

నా గురించి అంతగా మాట్లాడాలని ఉంటే.. నేను చేసిన మంచి గురించి చెప్పొచ్చు కదా. ఢీ షోలో విజేతగా నిలిచాను.. ఒక బాబును పెంచుకుంటున్నాను ఇవ్వన్నీ మాట్లాడొచ్చు కదా.. పర్యంతమైంది. రెండో పెళ్లి అంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.  నేను ఏం చేసినా ట్రోల్ చేస్తున్నారు. చచ్చిపోవాలనిపిస్తుంది’’ అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ రీసెంట్‌గా ఒక వీడియో రిలీజ్ చేసింది. 

Also Read: భారత్, పాక్ ప్రభుత్వ పెద్దలకు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్.. అసలేం జరుగుతోంది?

జాను లిరి మరో షాకింగ్ వీడియో

అది మరువక ముందే ఇవాళ మరొక సంచలన వీడియో రిలీజ్ చేసి అందరికీ గట్టి షాక్ ఇచ్చింది. ‘‘ అందరికీ సారీ. నేను నిన్న చేసిన వీడియో వల్ల చాలా మంది బాధపడ్డారు. మరికొందరు రియాక్ట్ అయ్యి సపోర్ట్ చేశారు. వారందరికీ చాలా థాంక్స్. నేను చాలా రోజుల నుంచి అన్నీ చూస్తున్నాను. కానీ ఎప్పుడూ ఏదీ పట్టించుకోలేదు. బాధ అనిపించి డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. 

Also Read:భారత్, పాక్ ప్రభుత్వ పెద్దలకు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్.. అసలేం జరుగుతోంది?

నాపై వస్తున్న ట్రోల్స్‌కు మా ఫ్యామిలీ వాళ్లు ఎక్కడ బాధపడుతున్నారో అని ఆలోచించి డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. నేను దేనికీ భయపడేదాన్ని కాదు. భయపడితే ఈ స్టేజ్‌లో నేను ఉండేదాన్ని కాదు. నేను చాలా స్ట్రాంగ్ అమ్మాయిని. చాలా మంది నా పెళ్లి గురించి మాట్లాడుతున్నారు. నా పెళ్లి వళ్ల మీకేమైనా నష్టం ఉందా?.. నేను కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాను.  నా కొడుకు నేను చాలా సంతోషంగా ఉన్నాం.’’ అంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చింది. దీంతో నెటిజన్లు ఆమెను కంగ్రాట్స్ చెబుతున్నారు. 

దిలిప్ దేవగన్ వీడియో

Also Read:రాజాసాబ్ ఇటలీ లోనే ఉంటాడా..? ఫ్యాన్స్‎లో టెన్షన్ టెన్షన్..!

janulyri dance | Janulyri on Social Media Trolls | janulyri speech | janu lyri

Advertisment
తాజా కథనాలు