Kishan reddy: సీఎం రేవంత్ మానసిక క్షోభకు గురిచేస్తున్నారు.. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

ఉద్యోగులు, ఉపాధ్యాయులను సీఎం రేవంత్ మానసికక్షోభకు గురిచేస్తున్నాడని కిషన్ రెడ్డి అన్నారు. బకాయిలు చెల్లించకుండా కాలేజీ యాజమాన్యాలను బిచ్చమెత్తుకునే దుస్థితికి తీసుకొచ్చారని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అసంతృప్తిగా ఉందన్నారు.

New Update
Kishan Reddy

Kishan Reddy sensational comments on CM Revanth

Kishan reddy: 14 నెలల పాలనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అసంతృప్తిగా ఉందన్నారు. డీఏలు, జీపీఎఫ్, పెండింగ్ బకాయిలు చెల్లించకుండా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లను రోడ్డున పడేస్తారా అంటూ మండిపడ్డారు. రిటైర్‌మెంట్ బెన్ ఫిట్స్ కూడా చెల్లించకుండా మానసిక క్షోభకు గురిచేయడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. ఉద్యోగులకు రోటీన్ గా చెల్లించాల్సిన బిల్లుల్లో కూడా సీలింగ్ పెట్టడం సిగ్గు చేటు అన్నారు. నిజాయితీగా పనిచేసే ఉద్యోగులకు ఏ సందేశం ఇస్తున్నట్లు? కళాశాలల యాజమాన్యాలపట్ల సీఎం తీరు దుర్మార్గంగా ఉందని విమర్శించారు.

నిజాయితీ ఉంటే ఆ పని చేయండి..

ఈ మేరకు ఏళ్ల తరబడి ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించకుండా వేధిస్తున్నారు. కాలేజీల యాజమాన్యాలు బిచ్చమెత్తుకునే దుస్థితి దాపురించింది. ఏప్రిల్, మే నెలలో బకాయిలు చెల్లిస్తామని కాలేజీ యాజమాన్యాలను మళ్లీ మభ్యపెట్టడం ఎంత వరకు కరెక్ట్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టెక్కేందుకు మళ్లీ మోసపూరిత హామీలకు సిద్ధమవడం సిగ్గు చేటు. నిరుద్యోగ భృతి ఆశ చూపి 14 నెలలుగా రూ.56 వేల బకాయిపడి యువతను దగా చేశారు. మీలో ఏమాత్రం నిజాయితీ ఉన్నా యుద్ద ప్రాతిపదికన బకాయిలు విడుదల చేయండి. ఈరోజే రూ.7500 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ సొమ్మును కాలేజీ యాజమాన్యాల ఖాతాల్లో జమ చేయండి అంటూ కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి:  AP Love case: ప్రియుడి కోసం పోటీ.. విషం తాగిన ఇద్దరు యువతులు.. చివరికి ఏమైందంటే!

అలాగే ఉద్యోగుల రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ బకాయిలన్నీ ఈరోజే విడుదల చేయాలని సూచించారు. యువత అకౌంట్లలో 14 నెలల బకాయి కలిపి రూ.56 వేల నిరుద్యోగ భృతి జమ చేయాలన్నారు. ఇవన్నీ యుద్ద ప్రాతిపదికన విడుదల చేసిన తరువాతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు అడగాలన్నారు. హామీలు, మోసపు మాటలతో మభ్యపెడితే మోసపోయేందుకు పట్టభద్రులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ వర్గాలు సిద్ధంగా లేరు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. 

ఇది కూడా చదవండి:  Pawan Kalyan: జగన్ జర్మనీ వెళ్లాలి.. పవన్ సెటైర్లు!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు