/rtv/media/media_files/2025/04/21/ieykUsfV06OPnRfu4m0j.jpg)
video viral
సాధారంగా ఎవరైనా చనిపోతే బోరున ఏడుస్తారు. తమతో కలిసి జీవించే ఒక వ్యక్తి ఇకపై ఉండడని తెలిసి ఊరు ఊరంతా కన్నీళ్లు పెట్టుకుంటారు. కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోతారు. బంధుమిత్రులు కన్నీటి పర్యంతమవుతారు. ఇంటి నుంచి స్మశానవాటికకు తీసుకెళ్లేంతవరకు ఏడ్చుకుంటూనే పాడెతో వెళ్తారు.
Also Read : ఆగని యుద్ధం.. 30 వేల మంది యువతను నియమించుకున్న హమాస్ !
శవం ముందు పెళ్లి డ్యాన్స్
కానీ ఇక్కడ ఓ ఘటన మాత్రం అందుకు విరుద్దంగా ఉంది. చనిపోయిన ఓ వ్యక్తిని పాడె ఎక్కించి ఊరు ఊరంతా డ్యాన్సులతో హోరెత్తించారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అది చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. వీరేంట్రా ఇలా ఉన్నారు అంటూ మాట్లాడుకుంటున్నారు.
Also Read : కేవలం రూ.300 వందలకే ఇంటింటికీ ఇంటర్నెట్.. రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త!
వీడియో బట్టి.. అది ఒక చిన్న గ్రామంలా కనిపిస్తుంది. ఒక వ్యక్తిని పాడెక్కించి ఆడ, మగ.. చిన్నా, పెద్దా ఇలా గ్రామస్తులంతా కలిసి డీజే పాటలు పెట్టి తీసుకెళ్తున్నారు. మార్గ మధ్యలో పాడెను ఆపి.. డీజే పాటలకు డ్యాన్సులు వేస్తున్నట్లు ఆ వీడియోలో కనిపిస్తుంది. ఒక పక్క మహిళలు, మరో పక్క పురుషులు డ్యాన్సులు వేస్తున్నారు. వారి వెనుక పాడెపై మృతదేహం ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక డ్యాన్సులు చేస్తున్న వారంతా.. నవ్వుకుంటూ.. చాలా సరదాగా.. సందడి చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Also Read: మావోయిస్టు అగ్రనేత హతం.. వివేక్‌ను మట్టుబెట్టిన భధ్రతాబలగాలు!
viral-video | viral-news | latest-telugu-news | telugu-news
Also Read: కర్ణాటక డీజీపీ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. తండ్రి హత్యకు సహకరించిన కూతురు?