/rtv/media/media_files/2025/01/29/n1IB38SwJPlxETLEz27R.jpg)
ap acb raid Photograph: (ap acb raid)
AP ACB Raid: ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండల తహశీల్దార్ ఎసీబీ వలలో చిక్కారు. కంచికచర్ల తహశీల్దార్ జాహ్నవి రెడ్డి రూ.30వేలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయింది. కంచికచర్ల మండలం పరిటాలకు చెందిన రైతు భూమి పట్టా సరిచేయడం కోసం మాగంటి కోటేశ్వరరావును తహశీల్దార్ రూ.లక్ష డిమాండ్ చేసింది. రూ.30వేలకు పాసు బుక్ జారీ చేసేటట్లు బేరం కుదుర్చుకున్నారు. బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. రైతు తహశీల్దార్ కార్యాలయంలో డబ్బులు ఇస్తుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు డైరెక్ట్‌గా పట్టుకున్నారు.
ఇది కూడా చదవండి : Breaking News : ఏపీ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా
రూ.30వేలు లంచం తీసుకుంటూ..
ఇందులో భాగమైన వీఆర్వో రామారావును కూడా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రూ.30వేలు లంచం తీసుకుంటూ తహశీల్దార్ జాహ్నవి రెడ్డి, వీఆర్వో రామారావులు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. కంచికచర్ల తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించినట్లు ఏసిబి డిఎస్పీ కిశోర్ బాబు మీడియాకు తెలిపారు. తహశీల్దార్ జాహ్నవి, విఆర్ఓ రామారావులను జ్యుడీషియల్ రిమాండ్ తరలించారు.
ఇది కూడా చదవండి :BREAKING: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో తండ్రి, కుమారుడు మృతి!
Also Read: Mazaka Movie: రోడ్లపై సందీప్ కిషన్, రావు రమేష్ డాన్సులు.. 'బ్యాచిలర్స్ ఆంథెమ్' వచ్చేసింది !
Also Read: Maha Kumbh Mela 2025: కుంభమేళాలో తొక్కిసలాటతో స్పెషల్ రైళ్లు రద్దు.. రైల్వేశాఖ క్లారిటీ!