/rtv/media/media_files/2025/01/29/czci5H5RQi4TiDDhKIbG.jpg)
harish kumar gupta Ap DGP
/rtv/media/media_files/2025/01/29/MY63w4hK3o02hilkJk63.jpg)
Also Read: Suryapet Murder: చంపింది నాన్నమ్మనే.. ప్రైవేట్ పార్ట్స్‌ను కసితీరా తొక్కి.. భార్గవి సంచలన నిజాలు!
ఎన్నికల సంఘం డీజీపీగా
సార్వత్రిక ఎన్నికల సమయంలో హరీష్ గుప్తాను ఎన్నికల సంఘం (election commission) డీజీపీగా నియమించింది. దీంతో కొన్నిరోజుల పాటు ఆయన ఆ పోస్టులో కొనసాగారు. రాజకీయ ఆరోపణల నేపథ్యంలో అప్పటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని ఈసీ బదిలీ చేసింది. ఆయన స్థానంలో హరీష్ కుమార్ గుప్తాను ఎంపిక చేసింది. సీనియార్టీలో ద్వారకా తిరుమల రావు, హరీశ్ కుమార్ గుప్తా, మాదిరెడ్డి ప్రతాప్ ల పేర్లను అప్పటి ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి ఈసీకి సూచించారు. ఇందులో సీనియర్ ఐపీఎస్, 1992 బ్యాచ్ కు చెందిన హరీశ్ కుమార్ గుప్తా పేరును ఈసీ డీజీపీగా ఎంపిక చేసింది. జమ్మూ కశ్మీర్‌కు చెందిన హరీష్ కుమార్ ఏపీ క్యాడర్‌కు ఎంపికయ్యారు.
ఆ తరువాత రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం (NDA Government) అధికారంలోకి వచ్చాక తిరుమలరావును డీజీపీగా నియమించింది. ఈయన పదవీ విరమణ అయ్యాక సీనియారిటీ లిస్టులో 1991 బ్యాచ్‌కు చెందిన అగ్నిమాపకశాఖ డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ మొదటి స్థానంలోఉండగా.. హరీష్ కుమార్ గుప్తా రెండో స్థానంలో ఉన్నారు.
Also Read : ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 14 మంది విద్యార్థులు
Also Read: Mazaka Movie: రోడ్లపై సందీప్ కిషన్, రావు రమేష్ డాన్సులు.. 'బ్యాచిలర్స్ ఆంథెమ్' వచ్చేసింది !