AP Crime: ఏపీలో దారుణం.. యజమానిని హతమార్చి పరారైన పనిమనిషి

విజయవాడలోని మాచవరంలో దారుణం చోటు చేసుకుంది. ఇంటి యజమాని బొద్దులూరి వెంకట రామారావును హతమార్చి ఇంట్లో ఉన్న బంగారం, నగలతో పనిమనిషి పరారైంది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

New Update
Vijayawada Crime News

Vijayawada Crime News

AP Crime: విజయవాడ(Vijayawada)లోని మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో భయానక సంఘటన చోటు చేసుకుంది. ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉంటున్న 70 ఏళ్ల బొద్దులూరి వెంకట రామారావు ఇంట్లో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన హత్య(Vijayawada Murder) స్థానికులను తీవ్రంగా కలవర పెట్టింది. రామారావు తన తల్లి సరస్వతితో కలిసి నివాసముంటున్నాడు. వృద్ధ తల్లి సంరక్షణ కోసం మూడు రోజుల క్రితం అనూష అనే యువతిని పని మనిషిగా నియమించారు. ఆమె కూడా వారితోపాటు అదే ఇంట్లో నివసించసాగింది.

Also Read: Lord's Test: ఆటకే కాదు నోటికీ పని చెప్తున్న గిల్..లార్డ్స్ టెస్ట్ లో కనిపించని బజ్ బాల్

ముఖంపై కారం పోసి మరి..

అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో రామారావు గదిలో లైట్లు వెలుగుతున్నట్లు గమనించిన తల్లి సరస్వతి.. అనుమానంతో ఆ గదికి వెళ్లింది. అక్కడ తన కుమారుడు అపస్మారక స్థితిలో మంచంపై పడి ఉండటం చూసి షాక్‌కు గురయ్యింది. అతని ముఖంపై కారం పూసి ఉండటంతో తల్లి కంగారు పడ్డారు. అంతేకాక గదిలోని బీరువా పగులగొట్టబడి ఉండటం కూడా ఆమెను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. పని మనిషి అనూష ఆ సమయంలో కనిపించలేదు. దీంతో ఆమె పక్క ఫ్లాట్‌లోని వాసులను పిలిచి విషయం చెప్పడంతో వారు కలిసి పోలీసులకు సమాచారం అందించారు.

ఇది కూడా చదవండి: రక్తపోటు పెరగడానికి ఈ అలవాట్లే కారణమా..?ఈ రోజే దానిని తరిమి వేయండి..!!

మాచవరం పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. ఆధారాలు సేకరించిన పోలీసులు అనూషను తెల్లవారుజామున 6 గంటల సమయంలో పట్టుకున్నారు. విచారణలో అనూష ఒప్పుకున్నట్లు సమాచారం. తన భర్త సాయంతో కలిసి ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిపింది. రామారావుపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం ఇంట్లో ఉన్న బంగారం, నగలు తీసుకుని పరారయ్యారు. మృతుడి శరీరాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించగా.. పూర్తి నివేదికతో హత్యకు గల కారణాలు మరింత స్పష్టతకు రానున్నాయి. అనూష భర్త కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ సంఘటనతో కాలనీలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.  

ఇది కూడా చదవండి: ఏపీ కానిస్టేబుల్ జాబ్స్.. ఫైనల్ రిజల్ట్స్ విడుదల.. లింక్ ఇదే!

( Latest News | ap-crime-news | ap crime updates | ap crime latest updates)

Advertisment
Advertisment
తాజా కథనాలు