AP Police Jobs: ఏపీ కానిస్టేబుల్ జాబ్స్.. ఫైనల్ రిజల్ట్స్ విడుదల.. లింక్ ఇదే!

ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ నియామక తుది రాత పరీక్ష ఫలితాలను అధికారులు విడుదల చేశారు. ఈ పరీక్షలో 33,921 మంది అర్హత సాధించారు. పరీక్ష రాసిన అభ్యర్థులు ఫలితాలు చూసుకోవడానికి https://slprb.ap.gov.in/UI/index లోకి వెళ్లాండి.

New Update
AP Police Jobs Results

AP Police Jobs Results

AP Police Jobs: ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ నియామకాలకు(AP Constable Recruitment) సంబంధించి కీలకమైన అధ్యాయం ముగిసింది. నియామక ప్రక్రియలో భాగంగా నిర్వహించిన తుది రాత పరీక్ష ఫలితాలను(AP Police Written Test Results) అధికారులు విడుదల చేశారు. ఈ పరీక్షలో మొత్తం 37,600 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వారిలో 33,921 మంది అర్హత సాధించారు. పరీక్ష రాసిన అభ్యర్థులు ఫలితాలు చూసుకోవడానికి https://slprb.ap.gov.in/UI/index లోకి వెళ్లాలి. హోమ్ పేజీలో ఉన్న 'Results' అనే లింక్‌పై క్లిక్ చేసి హాల్ టికెట్ నెంబర్‌తో పాటు పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. అంతేకాక అభ్యర్థుల ఓఎంఆర్‌ షీట్లు కూడా అందుబాటులో ఉంచారు. వీటిపై అభ్యంతరాలు ఉన్నవారు జూలై 11 నుంచి 17వ తేదీ మధ్యలో తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చు.

Also Read: Lord's Test: ఆటకే కాదు నోటికీ పని చెప్తున్న గిల్..లార్డ్స్ టెస్ట్ లో కనిపించని బజ్ బాల్

ఫలితాల వివరాల కోసం..

కానిస్టేబుల్ నియామక ప్రక్రియ 2023లో ప్రారంభమైంది. ముందు ప్రిలిమినరీ పరీక్షలో మొత్తం 4,59,182 మంది హాజరయ్యారు. వారిలో 95,208 మంది అభ్యర్థులు అర్హత సాధించి.. తదుపరి పరీక్షలకు అర్హులయ్యారు. 2024 డిసెంబరులో ఫిజికల్ ఫిట్‌నెస్ పరీక్షలు జరిగాయి. ఈ దశను 38,910 మంది అభ్యర్థులు విజయవంతంగా పూర్తి చేశారు. అనంతరం తుది రాత పరీక్షను 2025 జూన్ 1వ తేదీన నిర్వహించారు. దీని ఫలితాలు తాజాగా విడుదలై అర్హులైన అభ్యర్థుల  వివరాలను విడుదల చేశారు.

Also Read: Today Horoscope: నేడు ఈ రాశుల వారికి గడ్డు కాలమే.. సమస్యలు తప్పవు

ఇది కూడా చదవండి: మీకు తెలుసా ఈ ఫేస్ ప్యాక్ 15 నిమిషాల్లో ముఖం మిలమిల మెరిసిపోతుంది!

ఏపీ పోలీస్ శాఖలో దిగువ స్థాయి సిబ్బంది కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో.. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం పోలీస్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియను వేగవంతం చేసింది. వరుసగా వాయిదా పడుతూ వచ్చిన నియామకాలు ఇక పూర్తి దశకు చేరుకున్నాయి. ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కల్పించిన అనంతరం నియామక పత్రాలు పంపిణీ చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ నియామక ప్రక్రియ ద్వారా రాష్ట్రంలో పోలీసింగ్ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది.

ఇది కూడా చదవండి: సిగాచీ పేలుడులో మాయమైన మేనల్లుళ్ల కోసం ఎదురు చూపులు..చివరికి మేనత్త ప్రాణాలు!!

Advertisment