/rtv/media/media_files/2026/01/24/fotojet-8-2026-01-24-09-46-43.jpg)
Road Accident
ప్రకాశం జిల్లా(Prakasham District) మార్కాపురం నియోజకవర్గ పరిధి కొనకనమిట్ల మండలం చిన్నారికట్ల సమీపంలో రోడ్డు ప్రమాదం(road accident) సంభవించింది. ఇవాళ(శనివారం) తెల్లవారుజామున రోడ్డు పక్కన ఆగి ఉన్న మినీ లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఆదేసమయంలో విజయవాడ నుండి కనిగిరికి వెళుతున్న ఆర్టీ బస్సు ను వాసవి ట్రావెల్స్ బస్సు ఎదురుగా ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు స్పాట్‌లోనే మృతిచెందగా.. మరో 12మంది ప్రయాణికులు తీవ్ర గాయాలపాలయ్యారు.
ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని వెంటనే కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సమాచారం. వైద్యులు వారికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి కారణాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : మరో భర్తకు మూడింది.. తమ్ముడితో కలిసి భర్తను చంపిన భార్య
తుని హైవేపై మరో ప్రమాదం..
కాకినాడ(kakinada) సమీపంలోని తుని హైవేపై మరో ఘోర రోడ్డు ప్రమాదం(Prakasam Accident) జరిగింది. రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో రహదారిపై వెళ్తోన్న ప్రైవేట్ ఫ్లిక్స్ ట్రావెల్స్ బస్సు.. ముందుగా వెళ్తోన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రావెల్స్ బస్సు కో డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందగా.. బస్సులో ప్రయాణిస్తున్న డ్రైవర్ సహా 3 ప్రయాణీకులకు తీవ్రగాయాలు అయ్యాయి. పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యి, డోర్ లాక్ అవ్వడంతో..బస్సు అద్దాలు పగులగొట్టుకుని ప్రయాణీకులు బయటికి వచ్చారు. సీఐ గీతా రామకృష్ణ ఘటనా స్థలంలో సహాయక చర్యల్లో పాల్గొన్నారు. తాళ్ల సహాయంతో క్యాబిన్లో ఇరుక్కున్న వ్యక్తిని పోలీసులు బయటికి తీశారు. బస్సు విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 25 మంది ప్రయాణీకులు ఉన్నారు.ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Also Read : ఏపీలో పెను విషాదం.. ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహ**త్య!
Follow Us