TTD: వైకుంఠ ద్వార దర్శనం.. భక్తులకు TTD చైర్మన్ అదిరిపోయే శుభవార్త!

వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్యభక్తులకే పెద్దపీట వేయనున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించారు. అన్ని ప్రత్యేక దర్శనాలను పది రోజుల పాటు రద్దు చేసినట్లు చెప్పారు.

New Update
TTD Chairman BR Naidu

TTD Chairman BR Naidu

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులంతా కూడా వైకుంఠ ద్వార దర్శనం గురించి మాట్లాడుకుంటున్నారని టీటీడీ (TTD) ఛైర్మన్ బీఆర్‌ నాయుడు అన్నారు. తిరుమల అన్నమయ్య భవనంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పారు.

Also Read: Trump: అమెరికాలో విలీనమయ్యే అవకాశమే లేదు..ట్రంప్‌ కి ట్రూడో కౌంటర్‌!

టోకెన్లు కలిగిన భక్తులకే...

ఈ నెల 10న ఉదయం 4.30 గంటలకు ప్రొటోకాల్‌ దర్శనాలు ప్రారంభమవుతాయన్నారు. 8 గంటలకు సర్వదర్శనం ప్రారంభమవుతుందని చెప్పారు. టోకెన్లు కలిగిన భక్తులకే దర్శనాలకు అనుమతి ఉంటుందని చెప్పారు.

ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్వర్ణరథం ఊరేగింపు ఉంటుందన్నారు. అన్ని ప్రత్యేక దర్శనాలను ఈ పది రోజుల పాటు రద్దు చేసినట్లు వెల్లడించారు. సామాన్య భక్తుల కోసం సిఫార్సు లేఖల దర్శనం రద్దు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే టోకెన్ల జారీ కేంద్రాలు ఇప్పటికే భక్తులతో కిక్కిరిసిపోయాయని చెప్పారు.

Also Read: Open Ai: ఓపెన్‌ ఏఐ సీఈఓ పై లైగింక వేధింపుల ఆరోపణలు!

11 వ తేదీ ఉదయం శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తామన్నారు. తిరుమలలో ఒక్క కేంద్రం, తిరుపతిలో 8 కేంద్రాలలో టైం స్లాట్ టోకెన్స్ కేటాయింపు ఉంటుందని తెలిపారు.టోకెన్ కలిగిన భక్తులకే శ్రీవారి దర్శన భాగ్యమని..టోకెన్స్ లేని భక్తులను తిరుమలకు అనుమతిస్తామన్నారు.

 

9 వ తేది ఉదయం 5 గంటల నుంచి ఎస్ఎస్డీ టోకెన్లు జారీ చేస్తామని నాయుడు వివరించారు. ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనం (VIP Break Darshan) కల్పిస్తామన్నారు. 3 వేల మంది పోలీసులు, 1500 మంది విజిలెన్స్ తో భద్రత ఏర్పాట్లు చేసినట్లు చైర్మన్‌ అన్నారు. ఉదయం 6 నుంచి రాత్రి 12 గంటల వరకు నిరంతరాయంగా అన్నప్రసాదాల వితరణ  ఉంటుందని చెప్పారు.

టైం స్లాట్ జారీ చేసే సెంటర్ల వద్ద ఏర్పాటు చేసిన క్యూలైన్ లో ఇప్పటికే భక్తులు భారీస్థాయిలో చేరుకుంటున్నట్లు అధికారులు వివరించారు. గోవింద మాల వేసిన భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శనాలు లేవని నాయుడు వివరించారు.హెచ్ఎంపీవీ వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో భక్తులు  ఫేస్ మాస్కులు ధరించాలని సూచిస్తున్నట్లు చెప్పారు.

సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ అధిక మొత్తంలో టికెట్లను జారీ చేస్తున్నామని టీటీటీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సామాన్య భక్తులకు పెద్దపీఠ వేస్తున్నట్లు వివరించారు. వైకుంఠ ఏకాదశి శుక్రవారం రావడం జరిగిందని,  దాంతో మరో రెండు గంటలు అదనంగా స్వామి వారి కైంకర్యాలు కొనసాగుతాయని చెప్పారు. సామాన్య భక్తులు సైతం నిర్దిష్టమైన ప్లాన్ ప్రకారం వస్తే ఎలాంటి అసౌకర్యం కలుగకుండా శ్రీవారి దర్శనం కల్పిస్తున్నట్లు చౌదరి చెప్పారు.

Also Read: America: దారుణం..విమానం ల్యాండింగ్‌ గేర్‌ లో శవాలు..అసలు ఎలా వచ్చాయి?

Also Read:  Musk: భారత్, చైనా దేశాల్లో జనాభా క్షీణత.. ఎలాన్‌ మస్క్‌ ఆందోళన

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు