/rtv/media/media_files/2024/12/03/HWbEnDb61hlpKlBS8Xaq.jpg)
Canada: కెనడా ప్రధానిగా రాజీనామా చేస్తున్నట్లు జస్టిన్ ట్రూడో ప్రకటించిన కొన్ని గంటల్లోనే అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ''51వ రాష్ట్రంగా విలీనం'' ప్రతిపాదనను మరోసారి తెరపైకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.ఈ ప్రతిపాదన పై ట్రూడో స్పందించారు. అమెరికాలో విలీనమయ్యే అవకాశమే లేదని స్పష్టంచేశారు.
Also Read: USA: బందీలను విడిచిపెట్టకపోతే మీ పని అంతే..హమాస్‌కు ట్రంప్ వార్నింగ్
కెనడా అమెరికాలో...
ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. కెనడా అమెరికాలో భాగమయ్యే అవకాశమే లేదు. రెండు దేశాలలోని కార్మికులు, ప్రజలు వాణిజ్యం, భద్రతా భాగస్వామ్యం ద్వారా లాభపడుతున్నారు అని ట్రూడో అన్నారు. ఇటీవల కెనడా, మెక్సికోల పై 25 శాతం సుంకం విధించనున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
Also Read: Sheikh Hasina: బంగ్లా మాజీ ప్రధాని షేక్ హాసినా పాస్‌పోర్టు రద్దు!
అనంతరం కెనడా ప్రధాని ట్రూడో ..ట్రంప్ తో భేటీ అయ్యారు. వలసలు,డ్రగ్స్ అక్రమరవాణాను సరిహద్దుల్లోనే కట్టడి చేయాలని,లేనిపక్షంలో సుంకాలు పెంచుతానని ట్రంప్ హెచ్చరించారు. అంతేకాక ఇందులో విఫలమైతే అమెరికా లో 51వ రాష్ట్రంగా చేరాలని ట్రూడోకు చురకలంటించారు.
ఈ క్రమంలో గవర్నర్ ఆఫ్ కెనడా అంటూ ట్రూడోను వ్యంగ్యంగా . మరోవైపు..ట్రూడో తన ప్రధాని పదవికి త్వరలో రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు.లిబరల్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి కూడా వైదొలుగుతున్నట్లు తెలిపారు.తన వారసుడిని పార్టీ ఎంపిక చేసేవరకూ ప్రధాని పదవిలో కొనసాగుతానని చెప్పారు.
పార్టీ పదవితో పాటు ప్రధాని బాధ్యతలు మార్క్ కార్నీ,లీ బ్లాంక్ లలో ఒకరు చేపట్టనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే కెనడా 51వ రాష్ట్రంగా చేరాలనే తన ప్రతిపాదనను ట్రంప్ మరోసారి లేవనత్తారు. అమెరికాలో భాగస్వామ్యం కావడం కెనడాలో చాలా మంది ప్రజలకు ఇష్టమే.
అమెరికాలో విలీనమైతే ఈ సుంకాలు, అధిక పన్నులు ఉండవు. నిరంతరం చుట్టుముట్టి ఉండే రష్యా, చైనా నౌకల ముప్పు నుంచి సురక్షితంగా ఉండొచ్చన్నారు. ఈ వ్యాఖ్యలపై ట్రూడో తాజాగా కౌంటర్ ఇచ్చారు.
Also Read: America: దారుణం..విమానం ల్యాండింగ్ గేర్ లో శవాలు..అసలు ఎలా వచ్చాయి?
Also Read: Delhi: ఢిల్లీ ఎలక్షన్స్ తర్వాత హిమాలయాలకు పోతా..సీఈసీ రాజీవ్ కుమార్