/rtv/media/media_files/2025/01/08/niVrwDYEBoWu5cqIn5AL.jpg)
jet blue
America: అమెరికా విమానాశ్రయంలో రెండు మృతదేహాలు కలకలం రేపుతున్నాయి. ఫ్లోరిడా విమానాశ్రయంలో జెట్‌బ్లూ విమానం ల్యాండింగ్ గేర్‌లో రెండు మృతదేహాలు తాజాగా కలకలం రేపాయి. ఫోర్ట్ లాడర్‌డేల్-హాలీవుడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం రాత్రి విమనం చక్రాల దగ్గర రెండు మృతదేహాలు ఉన్నట్లు జెట్‌బ్లూ ఎయిర్‌లైన్ ఒక ప్రకటనలో తెలిపింది.
Also Read: Konstas: బుమ్రాతో కొన్‌స్టాస్ గొడవ.. చివరి బంతికే వికెట్, కోహ్లీ రియాక్షన్ చూశారా!
న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్. కెన్నెడీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాత్రి 11 గంటలు దాటిన తర్వాత విమానం ఫోర్ట్ లాడర్‌డేల్‌కు చేరింది.
తనిఖీల సమయంలో రెండు మృతదేహాలు బయటపడినట్లు ఎయిర్‌లైన్ పేర్కొంది. మృతులు ఎవరినేది ఇంకా తెలియలేదని.. అలాగే ఈ ఘటన ఎలా జరిగిందో తెలుసుకునేందుకు దర్యాప్తు చేయాల్సి ఉంటుందని చెప్పింది. .విమానం ప్రారంభ సమయంలో ఏం జరిగిందో గుర్తించాలని.. అలాగే ఆ వ్యక్తులు ఎలా అందులోకి వచ్చారన్న సంగతి కూడా దర్యాప్తులో తేలాల్సి ఉందని ఎయిర్‌లైన్ చెప్పింది.
Also Read: Ind vs Aus: రోహిత్‌ను కావాలనే తప్పించారు: ఆసీస్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!
ఈ ఘటన మాత్రం విషాదకరమైన ఘటనగా అధికారులు పేర్కొన్నారు. అధికారులతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఎయిర్ లైన్ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే సంఘటనా స్థలంలోనే ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు పారామెడిక్స్ పేర్కొన్నారు.
ఇది రెండోసారి..
ఇదిలా ఉంటే అమెరికాలో గడిచిన నెల రోజుల్లో ఈ తరహా ఘటన జరగడం ఇది రెండోసారి అని తెలుస్తుంది. డిసెంబర్ చివరిలో షికాగో నుంచి మౌయీ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఓ యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం ల్యాండింగ్ గేర్‌లోనూ ఓ మృతదేహం ఇదే స్థితిలో కనిపించింది.
అసలు ఈ మృతదేహాలు ఎవరివి. అసలు విమానం ల్యాండింగ్ గేర్ లోకి ఎలా వచ్చాయి అనేది మాత్రం తెలియలేదు.దీని గురించి విమానాశ్రయ అధికారులు విచారణ చేపట్టి, దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Dan Christian: రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్న స్టార్ క్రికెటర్.. గ్రౌండ్‌లోకి రీఎంట్రీ!