ఓపెన్ ఏఐ (OpenAI) సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ పెను వివాదంలో చిక్కుకున్నారు. ఆయన పై సొంత చెల్లే సంచలన ఆరోపణలు చేశారు.దాదాపు దశాబ్ద కాలం పాటు సోదరుడు శామ్ తనపై లైగింక వేధింపులకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు.ఈ మేరకు మిస్సోరీ డిస్ట్రిక్ట్ కోర్టులో దావా వేశారు. Also Read: Trump: అమెరికాలో విలీనమయ్యే అవకాశమే లేదు..ట్రంప్ కి ట్రూడో కౌంటర్! తనకు మూడు సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచే ఈ దారుణాలను ఎదుర్కొన్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మిస్సోరీలోని క్లేటన్ లో మా ఇంట్లోనే నేను వేధింపులను ఎదుర్కొన్నా. అప్పుడు నాకు మూడు సంవత్సరాలు. శామ్కు 12 ఏళ్లు.1997 నుంచి 2006 వరకు అతడు నా పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. వారానికి పలుమార్లు దాన్ని ఎదుర్కోవాల్సి వచ్చేది. Also Read: Delhi: ఢిల్లీ ఎలక్షన్స్ తర్వాత హిమాలయాలకు పోతా..సీఈసీ రాజీవ్ కుమార్ ఈ దారుణమైన అనుభవాల కారణంగా నేను తీవ్ర ఒత్తిడికి లోనయ్యా. మానసికంగా కుంగిపోయా. ఈ డిప్రెషన్ భవిష్యత్తులోనూ కొనసాగుతుందేమో అని శామ్ చెల్లి తన దావాలో పేర్కొన్నారు. ఓపెన్ ఏఐ సీఈఓ పై ఆమె గతంలోనూ ఓ సారి ఎక్స్ వేదికగా ఈ ఆరోపణలు చేశారు. అయితే ఈ సారి కోర్టును ఆశ్రయించడంతో ఆయన విచారణ ఎదుర్కోవాల్సిందే. అయితే సోదరి ఆరోపణలను ఖండిస్తూ శామ్ ఆల్ట్మన్ ఆయన తల్లి , సోదరులు సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. ఆమెకు మానసిక స్థితి సరిగా లేదని ఆరోపించింది. ఆమె ఆరోగ్యం పై మేం చాలా ఆందోళనకు గురవుతున్నాం. మానసిక సమస్యలు ఎదుర్కొంటున్న ఓ కుటుంబ సభ్యురాలిని జాగ్రత్తగా చూసుకోవడం చాలా కష్టమైన పని.ఆమెకు అండగా ఉండేందుకు మేం చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాం. అవాస్తవ ఆరోపణలు.. ఆర్థికంగానూ సాయం చేస్తున్నాం. ఇవన్నీ చేసినప్పటికీ ఆమె మమ్మల్ని ఇంకా డబ్బు కోసం వేధిస్తుంది. మా కుటుంబం పై ముఖ్యంగా శామ్ పై అవాస్తవ ఆరోపణలు చేసి మమ్మల్ని మరింత ఎక్కువగా బాధ పెట్టింది. ఆమె గోప్యత దృష్ట్యా మేం దీని పై బహిరంగంగా స్పందించొద్దని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఆమె కోర్టుకు వెళ్లడంతో ఈ ప్రకటన విడుదల చేయాల్సి వచ్చిందని శామ్ కుటుంబబం వెల్లడించింది.తండ్రి నిధులను అక్రమంగా అట్టిపెట్టుకుని సొంత కుటుంబ సభ్యులపైనే ఆరోపణలకు దిగింది. ఇప్పుడు మరింత దిగజారి శామ్ తనను లైంగికంగా వేధించాడని (Sexually Assault) అంటుంది. ఇవన్నీ అవాస్తవం.ఈ పరిస్థితుల్లో మా కుటుంబ గౌరవాన్ని గౌరవించాలని ప్రతి ఒక్కరినీ కోరుకుంటున్నాం. ఇకనైనా ఆమెకు మానసిక ప్రశాంతత చేకూరాలని ప్రార్థిస్తున్నాం అని ఆల్ట్‌మన్ కుటుంబం తమ ప్రకటనలో పేర్కొంది. ఆరోపణలు చేసిన సదరు చెల్లి..శామ్ కుటుంబానికి కొన్నేళ్లు దూరంగా ఉంటున్నట్లు చెప్పారు. ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీ సృష్టికర్త, ఓపెన్ ఏఐ సంస్థ సీఈఓగా శామ్ ఆల్ట్‌మన్ ఇటీవల ప్రపంచం దృష్టిని ఆకర్షిచారు. గతేడాది ఆయనను తొలగించడం తీవ్ర వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. ఉద్యోగులు,వాటాదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావటంతో కంపెనీ బోర్డు ఆయన్ని విధుల్లోకి తీసుకుంది. గతేడాది తన ప్రియుడ్ని ఆలివర్ మల్హెరిన్ ను ఆయన వివాహం చేసుకున్నారు. Also Read: America: దారుణం..విమానం ల్యాండింగ్ గేర్ లో శవాలు..అసలు ఎలా వచ్చాయి? Also Read: Sheikh Hasina: బంగ్లా మాజీ ప్రధాని షేక్ హాసినా పాస్‌పోర్టు రద్దు!