TTD: తిరుమల శ్రీవారి భక్తులకు బ్యాడ్‌న్యూస్.. ఐదు రోజుల పాటూ..

తిరుమలలో ఈనెల 9నుంచి 13 వరకు జరగనున్న సాలకట్ల తెప్పోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.మార్చి 11, 12, 13వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

New Update

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అధికారులు ఓ ముఖ్య హెచ్చరికను జారీ చేశారు. ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు నిర్వహిస్తున్నారనే విషయం తెలిసిందే. ఈ మేరకు రాత్రి 7 నుంచి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామి, అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. మార్చి 09న తెప్పోత్సవాల్లో తొలిరోజు శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి తెప్పలపై పుష్కరిణిలో మూడు చుట్లు తిరిగి భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు. 

Also Read: AP Tenth Exams: టెన్త్‌  విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఉచితంగా బస్సు ప్రయాణం.. అయితే ..!

మార్చి 10న రెండో రోజు రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణస్వామి తెప్పలపై మూడుసార్లు విహరించి భక్తులకు అభయం ఇవ్వనున్నారు.మార్చి 11న మూడవరోజు శ్రీభూ సమేతంగా మలయప్పస్వామివారు మూడుసార్లు పుష్కరిణిలో భక్తులకు కనువిందు చేస్తారు. మార్చి 12న నాలుగో రోజు అలాగే శ్రీమలయప్పస్వామివారు ఐదుసార్లు.. మార్చి 13వ తేదీన చివరి రోజు ఏడుసార్లు తెప్పపై పుష్కరిణిలో విహరించి భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు. తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల కారణంగా మార్చి 09, 10వ తేదీల్లో సహస్రదీపాలంకార సేవను రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. 

Also Read: Summer:ఎండలు ముదురుతున్నాయి..జాగ్రత్త!

మార్చి 11, 12, 13వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ అధికారులు సూచించారు.

మ‌హిళ‌ల భాగ‌స్వామ్యంతో స‌మాజంలో సంప‌దను సృష్టించ‌వ‌చ్చ‌ని, జ్ఞాన సంప‌ద‌కు మించిన సంప‌ద లేద‌ని టీటీడీ అద‌న‌పు ఈవో సీహెచ్ వెంక‌య్య చౌద‌రి పేర్కొన్నారు. తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అద‌న‌పు ఈవో హాజరయ్యారు. మాట్లాడుతూ, భార‌తీయ నాగ‌రిక‌త మొద‌లైన‌ప్ప‌టి నుండి మ‌హిళ‌ల‌కే పెద్ద‌పీట వేశార‌ని, సృష్టికి మూలం స్త్రీ అని, కుటుంబాన్ని ముందుండి న‌డ‌ప‌గ‌ల శ‌క్తి మాతృమూర్తి సొంత‌మని పేర్కొన్నారు. భారతీయ సమాజం మొదట్లో మాతృస్వామిక వ్యవస్థగా ఉండేదని, క్రమంగా పితృస్వామిక వ్యవస్థగా మారిందని తెలిపారు.

సనాతన ధర్మంలో మహిళకు పూజనీయమైన స్థానం ఉందని.. స్త్రీని దేవ‌త‌గా పూజించ‌డం ఇక్క‌డ మాత్ర‌మే ఉంద‌న్నారు టీటీడీ బోర్డు స‌భ్యులు రంగ‌శ్రీ. మహిళలు విద్యావంతులైతే ఆ కుటుంబం, సమాజం అభివృద్ధి సాధిస్తాయని చెప్పారు. మహిళలు జ్ఞానాన్ని అలవరచుకుని స్త్రీ పురుష సమానత్వాన్ని చాటాలన్నారు. సమాన అవకాశాలు కల్పించడం ద్వారా మహిళలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించగలరన్నారు. అంతరిక్ష యానం నుంచి యుద్ధరంగం వరకు అన్నింటా మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని మాట్లాడారు.

63 మంది మహిళా ఉద్యోగులను...

టీటీడీలోని వివిధ విభాగాల్లో విశేష సేవలు అందిస్తున్న 12 మంది మహిళా ఉద్యోగులకు ఈ సందర్భంగా పద్మావతి అవార్డులు ప్రదానం చేశారు. వీరిని శాలువతో సన్మానించి 5 గ్రాముల వెండి డాలర్, శ్రీ పద్మావతి అమ్మవారి జ్ఞాపిక అందజేశారు. అదేవిధంగా, ఏడాది కాలంలో ఉద్యోగ విరమణ చేయనున్న 63 మంది మహిళా ఉద్యోగులను శాలువ, జ్ఞాపికతో బహుకరించారు. ఈ కార్యక్రమంలో ముందుగా ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకులు, విద్యార్ధుల బృందం ప్రదర్శించిన భ‌ర‌త‌నాట్యం, వీణా వాయిద్య కచేరి ఎంతగానో ఆకట్టుకుంది. 

అనంతరం మహిళా ఉద్యోగులకు నిర్వహించిన వ్యాసరచన, పెయింటింగ్, క్విజ్, గాత్ర సంగీత పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందించారు. ఆ తర్వాత టీటీడీ మహిళా ఉద్యోగులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను  నిర్వహించారు.

Also Read: AP News: మగవారికంటే మహిళలే మెరుగ్గా రానిస్తున్నారు.. చంద్రబాబు సంచలన కామెంట్స్!

Also Read: Priyanka Chopra: అమ్మకానికి ప్రియాంక ఆస్తులు.. కోట్లలో డిమాండ్.. అదిమాత్రం చాలా కాస్ట్‌లీ!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు