/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/AP-CM-Chandrababu.jpg)
AP CM Chandrababu praises on womens
AP News: మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం నుంచి మహిళలకు మరింత ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. సంపాదనలో మగవారికంటే మహిళలే మెరుగ్గా రానిస్తున్నారని మహిళా పారిశ్రామికవేత్తల సదస్సులో కొనియాడారు.
మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి..
ఈ మేరకు మార్చి8న మహిళా దినోత్సవం సందర్భంగా విజయవాడలో శుక్రవారం ‘న్యూ జెనరేషన్-టెక్కేడ్ ఫర్ సస్టైనబుల్ ఎంటర్‌ప్రైజెస్ - ప్రోస్పెరిటీ ఫర్ ఆల్’ అనే అంశంపై సదస్సు నిర్వహిచారు. నోవోటెల్ హోటల్ జరిగిన ఈ అంతర్జాతీయ సదస్సులో మహిళా పారిశ్రామిక వేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు. మహిళల్లో నైపుణ్యాభివృద్ధిని పెంచడం, సాంకేతికత వినియోగం, నూతన ఆవిష్కరణల ద్వారా ఆర్థికంగా వృద్ధి సాధిస్తారని అన్నారు. మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని, ఇందుకు ఎన్డీయే ప్రభుత్వం ప్రోత్సాహాన్నిస్తుందని చెప్పారు.
పురుషులకంటే మహిళలే మెరుగు..
అంతేకాదు ప్రస్తుత రోజుల్లో పురుషులకంటే మహిళలే మెరుగ్గా రాణిస్తున్నారని కొనియాడారు. అన్ని రంగాల్లో అపారమైన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తున్నారన్నారు. శ్రామిక శక్తిలో మహిళలు లేకుండా పురోగతి అసాధ్యం. ప్రపంచ దేశాల్లో కెల్లా భారతదేశంలో మహిళల శ్రామిక శక్తి భాగస్వామ్యం గణనీయంగా పెరిగింది. నా చిన్నతనంలో నా తల్లి వంటగదిలో పడ్డ ఇబ్బందులు నేను చూశాను. నా తల్లి పడిన కష్టం ఏ మహిళా పడకూడదనే ఉచిత గ్యాస్ కనెక్షన్లు తీసుకొచ్చాం. నా తల్లి కష్టం ఈ పథకాన్ని తీసుకురావడానికి ప్రేరణగా నిలిచిందన్నారు. ప్రస్తుతం దీపం 2 కింద ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చి మహిళలపై భారాన్ని మరింత తగ్గించాం. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలను దాదాపు 45 శాతం మహిళలే నడిపిస్తున్నారని చెప్పారు. బ్యాంకు లింకేజ్ ద్వారా రుణాలు అందించి స్వయం సహాయక బృందాలను బలోపేతం చేయడంతో మహిళలకు ఆర్థికంగా స్వావలంబన సాధిస్తారన్నారు. అందుకోసం అన్ని రకాల కార్యక్రమాలు చేపట్టేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.
ఇది కూడా చూడండి: SVSC Re Release: థియేటర్ లో పూలకుండీ సీన్ రిక్రియేషన్.. SVSC రీరిలీజ్ హంగామా!
ఇక రాష్ట్రంలో వ్యాపారం ప్రారంభించాలనుకున్న ఏ మహిళకైనా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా నిర్మాణాత్మకమైన మద్దతును అందిస్తామని చెప్పారు. అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకుని మహిళలను ప్రోత్సహించి అద్భుతాలను సృష్టిస్తామన్నారు. ప్రతి మహిళ AIలోనూ రాణించాలని సూచించారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రకారం 2.4 ట్రిలియన్ డ్రాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఏపీ ఆవిష్కరించాలనే లక్ష్యంతో విజన్‌ను రూపొందించామన్నారు. ఏపీని ఆర్థికంగా ప్రపంచంలోనే నెంబర్ గా నిలిపి 15 శాతం వృద్ధి రేటు సాదించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
ఇది కూడా చూడండి: VIRAL VIDEO: కన్నీరు పెట్టిస్తున్న బాల్య వివాహం.. రానంటున్నా భుజంపై ఎత్తుకుని తీసుకెళ్లిన వరుడు!