/rtv/media/media_files/WfHHEnrrP3RFI96YuLbu.jpg)
TTD: తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. ఏప్రిల్ నెలలో మూడు రోజుల పాటు తిరుమలలో ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. ఏప్రిల్ పదో తేదీ నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల వసంతోత్సవాలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 10 నుంచి 12వ తేదీ వరకు మూడు రోజులపాటు ఈ ఉత్సవాలు జరగనున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా తిరుమలలో సాలకట్ల వసంతోత్సవాలు మూడు రోజులు నిర్వహించడం ఆనవాయితీ. ఉత్సవాల్లో భాగంగా ఏప్రిల్ పదో తేదీ ఉదయం స్వామి వారు నాలుగు మాడవీధులలో ఊరేగబోతున్నారు. ఊరేగింపు పూర్తైన తర్వాత వసంతోత్సవ మండపానికి వేంచేస్తారు. వసంతోత్సవ అభిషేక నివేదనలు పూర్తయ్యాక తిరిగి ఆలయానికి చేరుకుంటారు.
Also Read: Bank Merger: మే 1 నుంచి ఏపీలో ఆ బ్యాంకులు కనిపించవ్..
వసంతోత్సవాల్లో రెండో రోజు ఉదయం మలయప్పస్వామి బంగారు రథం మీద తిరుమాడ వీధులలో తిరుగుతారు. అనంతరం వసంత మండపంలో వసంతోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. చివరిరోజైన ఏప్రిల్ 12వ తేదీ శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామితో పాటుగా.. సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు,రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల సందర్భంగా ఈ మూడు రోజులు మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 6 నుండి 6.30 గంటల వరకు ఆస్థానం నిర్వహించబోతున్నారు.
Also Read: Telangana: తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే వార్త.. 604 కొత్త బ్రాండ్లు!
తిరుమల శ్రీవారి ఆలయంలో వసంతోత్సవాలను పురస్కరించుకుని టీటీడీ పలు ఆర్జిత సేవలు రద్దు చేసింది. ఈ క్రమంలో ఏప్రిల్ 10న తిరుప్పావడ సేవను రద్దు చేశారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 10 నుంచి 12వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని టీటీడీ ప్రకటించింది.
మరోవైపు తిరుమలలో భక్తుల కోసం కొత్తగా నిర్మిస్తున్న యాత్రికుల వసతి సముదాయాన్ని(పీఏపీ-5) టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి మంగళవారం పరిశీలించారు. పనుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. కొత్త భవనంలో భక్తుల కోసం చేస్తున్న ఏర్పాట్ల గురించి టీటీడీ ఏఈవో అడిగారు. కళ్యాణకట్ట, డైనింగ్ హాల్, మరుగుదొడ్లు, లాకర్లు వంటి సదుపాయాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్న టీటీడీ ఏఈవో.. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
Also Read: Instagram: ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు మెటా షాక్.. పేరెంట్స్ పర్మిషన్ లేకుండా ఆ వీడియోలు
tirumala | darshan | cancelled | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates
Follow Us