Honor 200 5G Price Drop: మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. 5జీ ఫోన్‌పై రూ.16వేల డిస్కౌంట్‌: డోంట్ మిస్ బ్రో!

హానర్ 200 5జీ ఫోన్‌పై అమెజాన్‌లో రూ.16వేల తగ్గింపు లభిస్తోంది. ఇది రూ.34,999కి బదులుగా రూ.24,998కి లిస్ట్ అయింది. రూ.3,000 కూపన్ తగ్గింపును పొందొచ్చు. పలు బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌‌లపై రూ. 3,000 అదనపు ప్రయోజనం లభిస్తుంది. దీంతో రూ.18,998కి కొనుక్కోవచ్చు.

New Update
Honor 200 5G smartphone available on Amazon with Rs. 16,000 discount

Honor 200 5G smartphone available on Amazon with Rs. 16,000 discountర

తక్కువ ధరలో శక్తివంతమైన ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా?.. అయితే ఇదే మీకు సరైన సమయం. అవును Honor 200 5G స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భారతదేశంలో రూ.16,000 వరకు తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఈ తగ్గింపుతో ఇప్పుడు కేవలం మరింత తక్కువ ధరకే ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. 

Also Read :  Gold Prices: ఎట్టకేలకు దిగొచ్చిన బంగారం ధర.. ఇదే గోల్డెన్‌ ఛాన్స్‌!

Honor 200 5G Discount

Honor 200 5G స్మార్ట్‌ఫోన్ 8GB/256GB వేరియంట్ ఇప్పుడు అమెజాన్‌లో రూ. 34,999కి బదులుగా కేవలం రూ.24,998కి అందుబాటులో ఉంది. దీనిపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు ఉన్నాయి. అందులో రూ.3,000 కూపన్ తగ్గింపును పొందొచ్చు. అలాగే మరోవైపు బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్‌ఎస్‌బిసి, ఫెడరల్ బ్యాంక్, అమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌‌లపై రూ. 3,000 అదనపు ప్రయోజం లభిస్తుంది. ఈ డిస్కౌంట్‌లతో హానర్ 200 5జీ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం ధర రూ. 18,998లకే సొంతం చేసుకోవచ్చు. అంటే దాదాపు రూ.16వేల తగ్గింపు లభిస్తుందన్న మాట. 

Also read : Aashiqui 3: బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీతో శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ.. టీజర్ అదిరింది! చూశారా

Honor 200 5G Specifications

Honor 200 5G స్మార్ట్‌ఫోన్‌ 6.7-అంగుళాల OLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఇది 4,000 nits గరిష్ట ప్రకాశాన్ని కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌లో Snapdragon 7 Gen 3 SoC ప్రాసెసర్‌ అందించారు. ఇది గరిష్టంగా 12GB RAM, 512GB వరకు స్టోరేజ్‌తో వస్తుంది. అలాగే 50MP పోర్ట్రెయిట్ ప్రధాన కెమెరా, 50MP టెలిఫోటో కెమెరా, 12MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. కంపెనీ ఇందులో 5200mAh బ్యాటరీని అందించింది. ఇది 100W సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

Also Read : Health: నెలరోజులు క్రమం తప్పకుండ ఈ పండు తింటే...బరువు పెరగరు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు