Weather: రుతుపవనాల సీజన్‌ లో అల్పపీడనాలు..ఎందుకింత తీవ్రం!

బంగాళాఖాతంలో అల్పపీడనాల సంఖ్య, తీవ్రత క్రమంగా పెరుగుతోంది.ఈ ఏడాది నైరుతికి పోటీగా ఈశాన్య రుతుపవనాల సీజన్‌ లోనూ అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి. అసలు టైమ్ కానీ టైమ్‌ లో అల్పపీడనాలు ఎందుకు ఏర్పడుతున్నాయో పూర్తి వివరాలు ఈ కథనంలో..

New Update
Rains

Ap Alert: బంగాళాఖాతంలో అల్పపీడనాల సంఖ్య, తీవ్రత క్రమంగా పెరుగుతోంది.ఈ ఏడాది నైరుతికి పోటీగా ఈశాన్య రుతుపవనాల సీజన్‌ లోనూ అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి. అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ కాలాన్ని ఈశాన్య రుతుపవనాల సీజన్‌ గా పరిగణిస్తారు.సాధారణంగా ఈ సమయంలో పోర్ట్‌ బ్లెయిర్‌ సమీపంలో ఉండే ఇంటర్‌ ట్రాపికల్‌ కన్వర్జెనస్‌ జోన్‌ తరచూ అల్పపీడనాలను ఉత్పత్తి చేస్తుంది.

Also Read:  Viral video:స్ట్రీట్‌ ఎక్స్‌ స్టోర్‌లో ఫ్రీ ఆఫర్..ఎగబడ్డ జనం తొక్కిసలాట

గతంలోనూ అవి ఏర్పడినా..వెంటనే బలహీనపడేవి. ఈ ఏడాది సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు,ఇతర పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో తీవ్ర రూపం దాల్చుతున్నాయి.భవిష్యత్తులోనూ ఈ పరిస్థితి కొనసాగుతుందని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.

Also Read: TS: నాగార్జునాసాగర్ దగ్గర హై డ్రామా..భద్రత విషయంలో గందరగోళం

సాధారణంగా  అక్టోబర్‌-నవంబర్‌ 15 మధ్యలో ఏర్పడే అల్పపీడనాలు ఒడిశా,ఉత్తరకోస్తా మధ్యలో తీరాన్ని తాకుతాయి.నవంబర్‌ 15 తర్వాత ఏర్పడితే మచిలీపట్నం,ఒంగోలు మధ్యలో డిసెంబర్‌ లో అయితే తమిళనాడులో తీరం దాటుతాయి.

Also Read: Madhya Pradesh: రామాలయంలో భారీ అగ్నిప్రమాదం.. కాలిపోయిన విగ్రహాలు

ప్రస్తుత పరిస్థితుల్లో వీటి గమనం అసాధారణంగా ఉంది.2023 లో ఏర్పడిన తుపాన్లన్నీ గమనం మార్చుకున్నాయి. గతేడాది డిసెంబర్‌ లో ఏర్పడిన మిగ్‌జాం తీవ్ర తుపాన్‌ తీరం వైపు కదిలే క్రమంలో రెండు సార్లు దిశ మార్చుకుంది. తమిళనాడు తీరం దాటాల్సిన తుపాన్‌ ఏపీలోని బాపట్ల సమీపంలో తీరం పైకిదూసుకొచ్చింది.

Also Read: అన్నా వర్సిటీ బాధితురాలికి భారీ పరిహారం.. మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు

ఈ సీజన్ లో ముందు అక్టోబర్‌ లో ఏర్పడిన వాయుగుండం చెన్నై  సమీపంలో తీరం దాటింది. ప్రస్తుతం పఫిఫిక్‌  మహాసముద్రంలో ఎల్‌నినో తటస్థంగా ఉంది. వాతావరణ మార్సుల ప్రభావంతో హిందూ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. పరిసర దేశాల్లో పారిశ్రామికీకరణ, జనాభా ఎక్కవవడంతో కాలుష్యం పెరుగుతోంది.

అక్టోబర్‌ లో ఎస్‌ఎస్‌టీ 28. 5 డిగ్రీలుంటే,నవంబర్‌ లో మరింత పెరుగుతుంది.డిసెంబర్‌ లో ఉష్ణోగ్రతలు తగ్గుతాయి.కానీ ప్రస్తుతం సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. భూభాగం చదునుగా ఉండడంతో బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలు తూర్పు తీరం వైపు దూసుకొస్తున్ఆయి.గాలిలో తేమ పెరగడం,ఈశాన్య రుతుపవనాలు చురుకుగా కదలడంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

గతంలో తుపాను వస్తుందంటే భయపడేవారు. ఇప్పుడు అల్పపీడనం పేరు చెబితేనే ఆందోళన వ్యక్తమవుతోంది.వాటికి పోటీగా రుతుపవన ద్రోణుల ప్రభావంతోనూ ఎక్కువ వర్షపాతం నమోదవుతోంది.

Advertisment
తాజా కథనాలు