Operation Sindoor : ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధం లో తెలుగు జవాన్ మురళీనాయక్ మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ఆయన మృతదేహన్ని శనివారం రాత్రి ఆయన స్వగ్రామం కళ్లితండాకు తరలించారు. ఈ రోజు అధికారిక, సైనిక లాంఛనాలతో మరుళీనాయక్ అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర, రాష్ర్ట మంత్రులతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన నున్నారు. ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న అగ్నివీర్ మురళీనాయక్ గురువారం అర్ధరాత్రి రాజౌరి సెక్టార్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో అమరుడైన సంగతి తెలిసిందే.
Also Read: BIG BREAKING: జమ్ము కశ్మీర్‌కు తప్పిన భారీ ప్రమాదం.. పాక్ దాడిని తిప్పి కొట్టిన ఇండియా
యుద్ధంలో చనిపోవడంతో మురళీనాయక్ కు సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగనుండగా ఏపీ ప్రభుత్వం కూడా అధికారిక లాంఛనాలకు ఏర్పాట్లు చేస్తుంది. ఈ అంత్యక్రియలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హోమ్ మంత్రి వంగలపూడి అనిత, మంత్రులు నారా లోకేష్, అనగాని సత్యప్రసాద్ తదితరులతో పాటు పలువురు సైనిక, పోలీస్ అధికారులు పాల్గొననున్నారు. దీంతో గ్రామాన్ని ఇప్పటికే పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
అడుగడుగున కన్నీటి నివాళులు
కాగా రాజౌరి సెక్టార్‌లో కనుమూసిన వీరజవాన్ మురళీనాయక్ పార్థివదేహాన్ని శనివారం ఢిల్లీ నుంచి ఇండిగో విమానంలో బెంగళూరు ఎయిర్‌పోర్టుకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి సవిత, మహారాష్ట్ర నుంచి మంత్రి ఉదయ్ సామంత్, కర్ణాటక తరఫున దేవనహళ్లి తహసీల్దారు విమానాశ్రయంలో మురళీ నాయక్ పార్థివదేహానికి నివాళులు అర్పించారు. అనంతరం స్వగ్రామానికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. మురళీనాయక్ వీరమరణం విషయం తెలిసిన పలువురు విమానశ్రయం వద్దకు చేరుకుని జోహర్లు అంటూ నినాదాలు చేశారు.
Also Read: వారిని చూస్తే గర్వంగా ఉంది.. ఆపరేషన్ సిందూర్‌పై ఖర్గే సంచలన కామెంట్స్!
అనంతరం ఆయన పార్థివదేహన్ని తరలించేందుకు జీరో ట్రాఫిక్ మార్గాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర సరిహద్దుల వరకు పంపించారు. ఆర్మీ కాన్వాయ్ వెంట రాష్ట్రమంత్రి సవిత ఉన్నారు. కాగా కాన్వాయ్ వెంట పెద్ద ఎత్తున జనం వాహనాల్లో అనుచరించారు. దారిపోడవున నివాళులు అర్పించారు. కర్ణాటక బాగేపల్లి ఎమ్మెల్యే సుబ్బారెడ్డితో పాటు వందలాది మంది మురళీ పార్థివదేహం వెంట కాన్వాయ్‌లో నివాళులు అర్పించి పూలతో నీరాజనాలు అర్పించారు.
ఇది కూడా చూడండి: Indian Army: కాల్పుల విరమణకు ఒకే.. కానీ.. ఇండియన్ ఆర్మీ సంచలన ప్రకటన
ఇక శ్రీ సత్యసాయి జిల్లా సరిహద్దుకు చేరుకోగానే హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి, ఎమ్మెల్యేలు కందికుంట వెంకటప్రసాద్, ఎంఎస్ రాజు, పరిటాల సునీత, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, వేలాది మంది జనం కన్నీటి నివాళులు అర్పించారు.అక్కడి నుంచి గోరంట్ల మండలంలోని మురళీ స్వగ్రామం కళ్లితండాకు తీసుకువచ్చారు. సైనికాధికారులు మురళీనాయక్ పార్థివదేహాన్ని ఆయన తల్లిదండ్రులు శ్రీరామనాయక్, జ్యోతిబాయికి అప్పగించారు. గ్రామంలో శనివారం రాత్రి నుంచి వేలాది మంది ప్రజలు మురళీ భౌతికకాయానికి నివాళులు అర్పిస్తూనే ఉన్నారు.
Also Read: BIG BREAKING: జమ్ము కశ్మీర్‌కు తప్పిన భారీ ప్రమాదం.. పాక్ దాడిని తిప్పి కొట్టిన ఇండియా