/rtv/media/media_files/2025/05/10/fsmRgn1kdnT8DhRkHay8.jpg)
Indian Army
భారత్-పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తలపై ఇరుదేశాలు శనివారం కాల్పుల విరమణకు అంగీకరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రకటన తర్వాత భారత సైనికాధికారులు మీడియాతో మాట్లాడారు. పాకిస్థాన్ భారత్‌పై పదేపదే అసత్య ప్రచారాలు చేస్తోందని అన్నారు. కాల్పుల విరమణ ఒప్పందానికి తాము కట్టుబడి ఉన్నామని.. కానీ భారత సైన్యం ఎల్లప్పుడూ కూడా అప్రమత్తంగా ఉంటుందని పేర్కొన్నారు.
Also Read: భారత్-పాకిస్థాన్ మధ్య ఆగిన యుద్ధం..
భవిష్యత్తులో మళ్లీ పాకిస్థాన్ దాడులకు పాల్పడితే గట్టిగా సమాధానమిస్తామని తేల్చిచెప్పారు.'' గత కొన్నిరోజుల నుంచి పాక్ భారత్‌పై తప్పుడు ప్రచారాం చేస్తోంది. S-400, బ్రహ్మోస్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలపై దాడులు చేశామని చెప్పడం పూర్తిగా అవాస్తవం. అలాగే జమ్మూ, బఠిండా, భుజ్, సిర్సాలపై దాడులు చేశామంటూ చెప్పడం కూడా అబద్ధమే. అలాగే నలియా, పఠాన్‌కోట్ వాయుసేన స్థావరాలపై, చండీగఢ్ ఆయుధాగారంపై దాడులు చేశామని తప్పుడు ప్రచారం చేసింది.
Also Read: హైదరాబాద్ లో గ్రాండ్ గా మొదలైన మిస్ వరల్డ్ పోటీలు.. లైవ్ ఇక్కడ చూడండి
తమ ప్రార్థనా మందరాలపై భారత్ దాడి చేసిందంటూ ఆరోపణలు చేశారు. భారత్ ఒక లౌకిక దేశం. ఎప్పుడూ కూడా ప్రార్థనా మందిరాలపై దాడులు చేయదు. మన ప్రతిదాడుల వల్ల పాకిస్థాన్‌కు తీవ్రంగా నష్టం జరిగింది. పాక్ రాడర్, క్షిపణి రక్షణ వ్యవస్థలను కూడా ధ్వంసం చేశాం. నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్‌కు నష్టాన్ని మిగిల్చాం. కాల్పుల విరమణకు అంగీకరించినప్పటికీ కూడా భారత సైన్యం ఎప్పుడూ సన్నద్ధదతో ఉంటుందని'' సైనిక అధికారులు చెప్పారు.
Also Read: పాకిస్థాన్ కాళ్లబేరానికి రావడానికి 10 ప్రధాన కారణాలు
కాల్పుల విరమణకు అంగీకరించిన పాకిస్తాన్ కొన్ని గంటల్లోనే తన వక్రబుద్దిని చూపించింది. సీజ్ ఫైర్ అంటూనే జమ్మూలోని పలన్వాలా సెక్టార్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి పాకిస్తాన్ శనివారం కాల్పులకు పాల్పడింది. అఖ్నూర్, రాజౌరి, ఆర్‌ఎస్ పురా సెక్టార్లలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ సైన్యం ఫిరంగి దాడులకు పాల్పడింది. జమ్మూ నుండి పంజాబ్, రాజస్థాన్ వరకు అనేక నగరాలపై డ్రోన్ , క్షిపణి దాడులు జరిగాయి. బారాముల్లాలో పేలుళ్లు సంభవించాయని, ఒక డ్రోన్‌ను కూల్చివేసినట్లు, ఆ ప్రాంతంలో అనుమానాస్పదంగా ఒక వైమానిక వాహనం (UAV) కనిపించినట్లు నివేదికలు వచ్చాయి. అటు భారత బీఎస్ ఎఫ్ జవాన్లు కూడా ధీటుగానే బదులిస్తున్నాయి.
India-Pakistan Ceasefire | Pak Ceasefire Violation | rtv-news