తక్కువ రేటుకే నెయ్యి సరఫరా.. అనుమానం వ్యక్తం చేసిన టీటీడీ ఈవో
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ జరిగిందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో టీటీడీ ఈవో మీడియాతో మాట్లాడారు. లడ్డూ నాణ్యత విషయంలో భక్తుల నుంచి ఫిర్యాదులు వచ్చాయన్నారు. తక్కువ రేటుకు నెయ్యి సరఫరా చేయడంతో అనుమానం వచ్చి పరీక్షలు నిర్వహించగా.. జంతువుల కొవ్వు ఉన్నట్లు తేలిందన్నారు.