రేపు తిరుమలకు చంద్రబాబు.. ప్రభుత్వం తరుఫున పట్టువస్త్రాల సమర్పణ! ఏపీ సీఎం చంద్రబాబు శుక్రవారం తిరుమల పర్యటనకు వెళ్లనున్నారు. స్వామి వారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. తిరుమలలో నూతనంగా నిర్మించిన వకుళామాత వంటశాలను సీఎం ప్రారంభించనున్నారు. By Bhavana 03 Oct 2024 in ఆంధ్రప్రదేశ్ తిరుపతి New Update షేర్ చేయండి Chandra Babu : ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం తిరుమల పర్యటనకు వెళ్లనున్నారు. స్వామి వారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. రేపు సాయంత్రం 6:20కి తిరుమలకు చేరుకుంటారు. బేడి ఆంజనేయస్వామి ఆలయం నుంచి పట్టువస్త్రాలతో ఊరేగింపుగా ఆలయానికి చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు చేరుకుంటారు. తర్వాత శ్రీవారి ఆలయంలో గడపనున్నారు. అలాగే 2025 వార్షిక సంవత్సరం క్యాలెండర్లను చంద్రబాబు ఆవిష్కరించనున్నారు. శనివారం ఉదయం 7.35కి 5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన వకుళామాత వంటశాలను చంద్రబాబు ప్రారంభించనున్నారు. తర్వాత విజయవాడకు చేరుకుంటారు. సీఎం పర్యటన వివరాలు.. రేపు సాయంత్రం 6:20కి తిరుమలకు చంద్రబాబు* రాత్రి 7:55కి బేడి ఆంజనేయస్వామి ఆలయం నుంచి పట్టువస్త్రాలతో ఊరేగింపు.* ఊరేగింపుగా స్వామి వారి ఆలయానికి చేరుకోనున్న చంద్రబాబు దంపతులు* రాత్రి 7:55 నుంచి 9:15 వరకు శ్రీవారి ఆలయంలోనే ఉండనున్న చంద్రబాబు* 2025 వార్షిక సంవత్సరం క్యాలెండర్లును ఆవిష్కరించబోతున్నారు.* ఎల్లుండి ఉదయం 7.35కి వకుళామాత వంటశాలను ప్రారంభిస్తారు.* ఉదయం 7:55కి చంద్రబాబు తిరుమల పర్యటన ముగుస్తుంది.* తిరుమల నుంచి రేణిగుంటకు.. అక్కడి నుంచి విజయవాడ చేరుకుంటారు. Also Read : సారీ చెప్పినా తగ్గేదేలే.. సురేఖకు లీగల్ నోటీసులు పంపనున్న నాగార్జున #tirumala #chandrababu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి