BREAKING: లడ్డూ కల్తీపై విచారణ బంద్.. బాబు సర్కార్ సంచలన నిర్ణయం AP: లడ్డూ వివాదంపై చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. లడ్డూ కేసులో సిట్ విచారణను నిలిపివేసింది. ఈ నెల 3వ తేదీ వరకు సిట్ విచారణను నిలిపివేస్తున్నట్లు డీజీపీ ప్రకటన చేశారు. By V.J Reddy 01 Oct 2024 in ఆంధ్రప్రదేశ్ తిరుపతి New Update షేర్ చేయండి Laddu Case: దేశవ్యాప్తంగా సంచనలన సృష్టించిన తిరుమల లడ్డూ వివాదంపై చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. లడ్డూ కేసులో సిట్ విచారణను నిలిపివేసింది. ఈ నెల 3వ తేదీ వరకు సిట్ విచారణను నిలిపివేస్తున్నట్లు డీజీపీ ప్రకటన చేశారు. కోర్టు విచారణ నేపథ్యంలో విచారణకు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆయన చెప్పారు. సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుకూలంగా విచారణను ముందుకు తీసుకెళ్తామన్నారు. బాబు సర్కార్‌పై సుప్రీం గరం... శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారన్న అంశంపై సుప్రీంకోర్టులో జస్టిస్ బి.ఆర్.గవాయ్, కె.వి.విశ్వనాథ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారన్న కామెంట్స్‌పై సుప్రీం సీరియస్ అయింది. టెస్టులకు పంపిన నెయ్యి లడ్డూల తయారీలో వాడలేదని ప్రాథమిక ఆధారాలున్నాయని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. వైసీపీ హయాంలో కల్తీ నెయ్యి వాడారని సీఎం బహిరంగ ప్రకటన చేశారని.. మరోవైపు కల్తీ నెయ్యి వాడలేదని ఈవో చెప్పినట్లు వార్తలు వచ్చినట్లు చెప్పింది. మధ్యలో దేవుళ్ళు ఎందుకు?... దేవుళ్లను రాజకీయాలకు దూరంగా ఉంచాలని సుప్రీంకోర్టు తెలిపింది. ల్యాబ్ రిపోర్టులో కొన్ని డిస్‌క్లెయిమర్స్ ఉన్నాయని పేర్కొంది. విచారణకు ఆదేశించిన తర్వాత మీడియా ముందు కామెంట్స్ ఎలా చేస్తారు అని ప్రశ్నించింది. మీకు జూలైలోనే రిపోర్టులు వచ్చాయని.. సెప్టెంబర్ 18న పబ్లిక్‌గా ఆరోపణలు చేశారని జస్టిస్ విశ్వనాథన్ అన్నారు. కచ్చితమైన ఆధారాలు లేనప్పుడు ఆరోపణలు ఎలా చేస్తారు అని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆధారం లేదు... కల్తీ నెయ్యి లడ్డూలో వాడినట్లు ఎలాంటి ఆధారం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై రెండో అభిప్రాయం కూడా తీసుకోలేదని.. ఈ రిపోర్టులు కేవలం నెయ్యిని తిరస్కరించడానికి సంబంధించినవే అని చెప్పింది. ఈ అంశంపై విచారణ అవసరమే అని అభిప్రాయపడింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణ చేయాలా లేదా అనేది ప్రశ్న అని అనుమానం వ్యక్తం చేసింది. సీబీఐ విచారణ జరపాలా లేదా అన్న అంశంపై కేంద్రం నుంచి సూచనలు తీసుకుంటామని తెలిపింది. తదుపరి విచారణను ఈ నెల 3వ తేదికి వాయిదా వేసింది. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి