AP: విచిత్ర వాతావరణం..అక్కడ వానలు..ఇక్కడ మండుతున్న ఎండలు!

ఏపీలో రెండు రోజుల నుంచి విచిత్రమైన వాతావరణం కనిపిస్తోంది. ఓ పక్క ఎండలు మండుతుండడంతో.. తీవ్ర ఉక్కబోతతో అల్లాడిపోతున్నారు. ఆ తరువాత వాతావరణం మారిపోయి మేఘాలు ఆవరించి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.

New Update
ap rains

Ap: ఏపీలో గత రెండు రోజులుగా విచిత్ర వాతావరణ నెలకొంది. ఓ వైపు కొన్ని జిల్లాల్లో ఎండలు మండుతుంటే..మరికొన్ని జిల్లాల్లో కుండపోత వానలు (Rains)   కురుస్తున్నాయి. ఎండలు కాసిన చోట 35 డిగ్రీలకుపైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బుధవారం అత్యధికంగా నెల్లూరులో 40.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. 

Also Read: అదానీ, పొంగులేటి డీల్.. రహస్య చర్చలు

అంతేకాకుండా ఇతర జిల్లాలు అయిన తిరుపతిలో 37.6, ప్రకాశం జిల్లా ఒంగోలులో 37.7, కడప 37.4, ఎన్టీఆర్ జిల్లా నందిగామ 36.9, నెల్లూరు కావలిలో 39.8, అనంతపురంలో 38.9, , అమరావతిలో 36.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఉక్కపోత, వేడికి ఇబ్బంది పడుతున్నారు.

రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి అనుకుంటుంటే.... గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలో పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. గురువారం  తిరుపతి, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. 

Also Read: రాక్షసిలా మాట్లాడుతున్నారు‌‌..సురేఖపై అమల ఆగ్రహం

ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, పల్నాడు, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి,  జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు అంచనా వేశారు. రాష్ట్రంలోని పలు చోట్ల బుధవారం వర్షాలు కురిశాయి. ఆరోగ్యవరంలో 57 మి.మీ., గన్నవరంలో 14 మి.మీ. అమరావతిలో 9 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

Also Read: హైడ్రా విషయంలో పునరాలోచనలో ప్రభుత్వం..ఇమేజ్ తగ్గకుండా జాగ్రత్తలు

 

Advertisment
Advertisment
తాజా కథనాలు