నిర్ణయం చెప్పని కేంద్రం.. తిరుపతి లడ్డూపై సుప్రీంకోర్టు విచారణ వాయిదా!
తిరుపతి లడ్డూ కల్తీ అంశంపై విచారణను సుప్రీంకోర్టు రేపటికి వాయిదా వేసింది. మంగళవారం ఉదయం 10.30 గంటలకు ఈ అంశంపై అత్యున్నత న్యాయస్థానం విచారణ జరపనుంది.
తిరుపతి లడ్డూ కల్తీ అంశంపై విచారణను సుప్రీంకోర్టు రేపటికి వాయిదా వేసింది. మంగళవారం ఉదయం 10.30 గంటలకు ఈ అంశంపై అత్యున్నత న్యాయస్థానం విచారణ జరపనుంది.
ఏపీ సీఎం చంద్రబాబు శుక్రవారం తిరుమల పర్యటనకు వెళ్లనున్నారు. స్వామి వారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. తిరుమలలో నూతనంగా నిర్మించిన వకుళామాత వంటశాలను సీఎం ప్రారంభించనున్నారు.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు.నడక మార్గంలో మొన్న తిరుమల చేరుకున్న ఆయన..తీవ్రమైన వెన్నునొప్పి కారణంగా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.అతిథి గృహంలోనే వైద్యులు ఆయనకు వైద్య సేవలు అందిస్తున్నారు.
ఏపీలో రెండు రోజుల నుంచి విచిత్రమైన వాతావరణం కనిపిస్తోంది. ఓ పక్క ఎండలు మండుతుండడంతో.. తీవ్ర ఉక్కబోతతో అల్లాడిపోతున్నారు. ఆ తరువాత వాతావరణం మారిపోయి మేఘాలు ఆవరించి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.
AP: రేపు తిరుపతిలో వారాహి బహిరంగ సభలో పాల్గొననున్నారు పవన్ కళ్యాణ్. మధ్యాహ్నం 3 గంటలకు సభలో వారాహి డిక్లరేషన్ను ప్రకటించనున్నారు. కాగా పవన్ కళ్యాణ్ ఏం ప్రకటన చేస్తారనే ఆసక్తి రాష్ట్ర ప్రజల్లో నెలకొంది.
పుంగనూరుకు చెందిన చిన్నారి అస్వియా (6) మిస్సింగ్ ఘటన విషాదాంతంగా ముగిసింది. 4 రోజుల తర్వాత పుంగనూరు సమ్మర్ స్టోరేజ్ దగ్గర చిన్నారి మృతదేహం లభ్యం అయింది. పోస్ట్మార్టం నివేదిక వెలువడిన తర్వాత తదుపరి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
AP: రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. ఈరోజు నుంచి చెత్త పన్నును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎక్కడా చెత్తపన్ను వసూలు చేయవద్దు అని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఎవరైన ఆదేశాలను బేఖాతర్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
పవన్ కల్యాణ్ చిన్న కుమార్తె పలీనా అంజని కొణిదెల తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ ఇచ్చారు. టిటిడి ఉద్యోగులు తీసుకువచ్చిన డిక్లరేషన్ పత్రాలపై పలీనా సంతకాలు చేయగా..ఆమె మైనర్ కావడంతో పవన్ కూడా సంతకాలు చేశారు.