తిరుమల ప్రసాదంలో జెర్రీ.. టీటీడీ కీలక ప్రకటన!

AP: భక్తుడు తింటున్న అన్నప్రసాదంలో జెర్రీ వచ్చిందని జరుగుతున్న ప్రచారాన్ని టీటీడీ ఖండించింది. వేడి పెరుగు అన్నంలో ఏమాత్రం రూపు చెదరకుండా జెర్రీ ఉండటం అనేది ఇది పూర్తిగా కావాలని చేసిన చర్య అని పేర్కొంది. దీనిని భక్తులు ఎవరు నమ్మొద్దని కోరింది.

New Update
TTD FAKE

TTD: తిరుమలలో భక్తుడు తింటున్న అన్నప్రసాదంలో జెర్రీ వచ్చిందంటూ జరుగుతున్న ప్రచారంపై టీటీడీ స్పందించింది. ఈ మేరకు ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. మాధవ నిలయంలోని అన్నప్రసాదములో తాము తిన్న అన్నప్రసాదంలో జెర్రీ కనబడిందని ఒక భక్తుడు చేసిన ఆరోపణలు వాస్తవదూరం అని పేర్కొంది. తిరుమల శ్రీవారి దర్శనార్థం వేలాదిమంది భక్తులకు వడ్డించడానికి పెద్ద మొత్తంలో టీటీడీ వారు అన్నప్రసాదాలను తయారుచేస్తారని తెలిపింది.

కావాలని చేశారు..

అంత వేడిలో ఏమాత్రం చెక్కుచెదరకుండా ఒక జెర్రీ ఉందని సదరు భక్తుడు పేర్కొనటం ఆశ్చర్యకరం అని అనుమానం వ్యక్తం చేసింది. ఒకవేళ పెరుగు అన్నాన్ని కలపాలంటే కూడా ముందుగా వేడి చేసిన అన్నాన్ని బాగా కలియపెట్టి తరువాత పెరుగు కలుపుతారని పేర్కొంది. అటువంటప్పుడు ఏమాత్రం రూపు చెదరకుండా జెర్రీ ఉండటం అనేది ఇది పూర్తిగా కావాలని చేసిన చర్య మాత్రమే గా భావించాల్సి వస్తుందని చెప్పింది. దయచేసి భక్తులు ఇటువంటి సత్యదూర వార్తలను నమ్మకూడదని టీటీడీ విజ్ఞప్తి చేసింది. 

అసలేం జరిగింది...

ఈరోజు తిరుమలలో అన్నదాన కేంద్రంలో పెరుగు అన్నంలో జెర్రి రావడం కలకలం రేపింది. టీటీడీ మాధవ నిలయం అన్నదాన కేంద్రంలో భోజనం చేస్తున్న భక్తుని ఆకులో జెర్రి దర్శనమిచ్చింది. అన్నప్రసాదంలో జెర్రి కనపడంపై టీటీడీ యాజమాన్యాన్ని భక్తులు ప్రశ్నిస్తున్నారు. టీటీడీ సిబ్బంది నిర్లక్ష్యపు సమాధానం చెప్పడమే కాకుండా తమను వెళ్ళిపోమన్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ ఉదయమే అన్నదానం పై టీటీడీ అధికారులను సీఎం చంద్రబాబు హెచ్చరించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు దీనిపై టీటీడీ అధికారులు ఇంకా స్పందించలేదు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు