Tirumala: తిరుమలలో ప్రీవెడ్డింగ్ షూట్‌లో రొమాన్స్.. మండిపడుతున్న భక్తులు

తిరుమల క్షేత్రంలో ఓ జంట విచ్చలవిడిగా ప్రవర్తించడం కలకలం రేపింది. కొండపై ఓ జంట ప్రీ వెడ్డింగ్ షూట్‌ను మితిమీరి చేయడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. భక్తుల ఉండగానే రొమాన్స్ చేయడంతో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

author-image
By Kusuma
New Update
Tirumala

Tirumala

Tirumala: తిరుమల క్షేత్రం భక్తులతో ఎల్లప్పుడూ కలకలలాడుతుంటుంది. అత్యంత పవిత్రమైన ఈ ఆలయంలో ఓ జంట విచ్చలవిడిగా ప్రవర్తించడం(pre-wedding-shoot) కలకలం రేపింది. ఎందరో భక్తులు భక్తితో స్వామివారిని దర్శించుకునే సమయంలో ఓ జంట రొమాన్స్ చూడలేక ఇబ్బంది పడ్డారు. ఇలాంటి అనుచిత ప్రవర్తన చేయడంతో వారిపై భక్తులు మండిపడుతున్నారు. ఓ జంట తమ పెళ్లి కోసం ప్రీవెడ్డింగ్ షూట్‌ను తిరుమలలో చేసుకున్నారు. ఆలయం ఎదురుగా ఉన్న గొల్లమండపం నుంచి అఖిలాండం వరకు ఈ షూటింగ్ సాగింది. ఫోటోల కోసం ఆ జంట ఒకరినొకరు కౌగిలించుకోవడం, నుదిటిపై ముద్దులు పెట్టుకోవడం వంటి స్టిల్స్ ఇచ్చారు. దేవాలయం వంటి పవిత్ర స్థలంలో ఇలాంటి ప్రవర్తన భక్తులను విస్మయానికి గురిచేసింది.

ఇది కూడా చూడండి: Ajith Pawar Plane Crash: అజిత్ పవార్ ప్రయాణించిన విమానం 'లీర్జెట్ 45' వివరాలు.. గతంలో కూడా ఇదే విమానానికి ఘోర ప్రమాదం!

రీల్స్ తీస్తే చర్యలు తప్పవు..

తిరుమల శ్రీవారి ఆలయం ముందు ఫోటో షూట్లు చేయడం, రీల్స్ తీయడం లేదా వీడియోలు చేయడంపై టీటీడీ ఇప్పటికే కఠినమైన నిషేధాన్ని విధించింది. దేవస్థాన గౌరవాన్ని, భక్తి భావాన్ని కాపాడటం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇంత బహిరంగంగా షూటింగ్ జరుగుతున్నా అక్కడ ఉన్న విజిలెన్స్ సిబ్బంది గానీ, అధికారులు గానీ అడ్డుకోకపోవడంపై భక్తులు మండిపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా(Social Media) లో వైరల్ కావడంతో నెటిజన్లు టీటీడీ(ttd) ని ప్రశ్నిస్తున్నారు. ఆలయ భద్రత కోసం వేల సంఖ్యలో సిబ్బంది ఉన్నప్పటికీ, గొల్లమండపం వంటి రద్దీగా ఉండే ప్రాంతంలో షూటింగ్ ఎలా సాగిందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తి కంటే ఫ్యాషన్, ప్రచారం ముఖ్యం అన్నట్లుగా కొందరు వ్యవహరిస్తున్నారని.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Advertisment
తాజా కథనాలు