AP Liquor Scam: ఏపీ లిక్కర్‌ స్కాంలో కీలక పరిణామం..వైఎస్‌ అనిల్‌రెడ్డి కంపెనీల్లో సిట్‌ సోదాలు

ఏపీ  మద్యంకుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కుంభకోణం పై ప్రభుత్వం నియమించిన సిట్ దూకుడు పెంచింది. తాజాగా మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ సోదరుడైన వైఎస్‌ అనిల్‌రెడ్డి కి సంబంధించిన కంపెనీలు, నివాసాల్లో సిట్‌ అధికారులు సోదాలు నిర్వహించడం కలకలం రేపింది.

New Update
SIT searches YS Anil Reddy's companies

SIT searches YS Anil Reddy's companies

AP Liquor Scam: ఏపీ  మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కుంభకోణం పై ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం దూకుడు పెంచింది. తాజాగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సోదరుడైన వైఎస్‌ అనిల్‌రెడ్డి (జగన్‌ పెదనాన్న వైఎస్‌ జార్జిరెడ్డి రెండో కుమారుడు)కి సంబంధించిన కంపెనీలు, నివాసాల్లో సిట్‌ అధికారులు సోదాలు నిర్వహించడం కలకలం రేపింది. తమిళనాడు రాష్ర్ట రాజధాని  చెన్నైలోని మైలాపూర్, టీనగర్, పేరంగుడి, అరప్పుకొట్టాయ్ తో పాటు హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఉన్న అనిల్‌రెడ్డికి సంబంధించిన కంపెనీల కార్యాలయాలు, ఇంజంబాక్కం, చెన్నై అళ్వార్‌పేట్ ల్లోని అనిల్‌రెడ్డి  నివాసాల్లో సిటి తనిఖీలు నిర్వహించింది.మద్యం ముడుపుల సొమ్మును ఈ కంపేనీల ద్వారా విదేశాలకు తరలించారని అనుమానిస్తున్న సిట్‌ అధికారులు.. దానికి సంబంధించిన ఆధారాలను సేకరించేందుకు గాను ఈ సోదాలు చేపట్టినట్లు తెలుస్తుంది.  తనిఖీల్లో భాగంగా సిట్‌ అధికారులు ఆయా కంపెనీల నుంచి కీలక డాక్యుమెంట్లు, హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం సాయంత్రం మొత్తం 10 చోట్ల ఏకకాలంలో ప్రారంభమైన సోదాలు రాత్రి 10.30 సమయం వరకు కొనసాగుతూనే ఉన్నాయి. మద్యం కుంభకోణం కేసులో జగన్‌కు అత్యంత సన్నిహితులు, ఆయన పార్టీనేతలు, మాజీ మంత్రులు తదితరుల ఇండ్లలో సిట్‌ సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.  

Also Read :  సుమన్ హీరోగా మంత్రి పొంగులేటి బయోపిక్.. సినిమాలో ఆ సీన్లే హైలైట్?

కాగా సిట్‌ తనిఖీ చేసిక కంపెనీల్లో షిలో ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, ఫోరెస్‌ ఇంపెక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌  తదితర కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలు అన్ని కూడా వైఎస్‌ జగన్‌ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాతే ఏర్పాటు చేయడం పై సిట్‌అనుమానాలు వ్యక్తం చేస్తోంది. మద్యం ముడుపుల సొమ్ము మళ్లింపు కోసమే ఈ కంపెనీలు ఏర్పాటు చేసినట్లు అనుమానిస్తున్న సిట్‌  అసలు ఈ సంస్థలు ఎందుకు పెట్టారు? అనే కోణంలో దర్యాప్తు చేస్తోంది. కాగా  అనిల్‌రెడ్డి పీఏ దేవరాజ్‌నూ ఇటీవల సిట్‌ విచారించింది. ఈ క్రమంలోనే ఆయన ఇచ్చిన సమాచారం మేరకే సంబంధిత కంపెనీల్లో సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. కాగా సిట్‌ అధికారులు  షిలో ఇన్‌ఫ్రా వెంచర్స్‌ ఎల్‌ఎల్‌పీ, షిలో ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ , క్వన్న ఎగ్జిమ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ , వర్క్‌ ఈజీ స్పేస్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ , ఇండోరాక్స్‌ ఎల్‌ఎల్‌పీ , ఫోరెస్‌ ఇంపెక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ,శ్రీ గోవిందరాజా మిల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ,  ట్రాన్‌సెల్‌ బయోలాజిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, హైదరాబాద్‌ తదితర కంపెనీల్లో సోదాలు చేసినట్లు తెలుస్తోంది.

Also read : TG Crime: ప్రాణం తీసిన పేకాట.. పోలీసులు రావడంతో పారిపోతుండగా హార్ట్ ఎటాక్!

Advertisment
తాజా కథనాలు