BIG BREAKING: కేసీఆర్తో హరీష్ అత్యవసర భేటీ.. కారణం అదేనా?

మాజీ సీఎం కేసీఆర్ తో ఎమ్మెల్యే హరీష్ రావు భేటీ అయ్యారు.  నేడు ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంలతో కేంద్ర జలశక్తి మంత్రి సమావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.  గోదావరి, కృష్ణా బేసిన్ లో పెండింగ్ ప్రాజక్టులపై ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశంలో చర్చించనున్నారు.

New Update
harish-rao

బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ తో ఎమ్మెల్యే హరీష్ రావు భేటీ అయ్యారు.  నేడు ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంలతో కేంద్ర జలశక్తి మంత్రి సమావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.  గోదావరి, కృష్ణా బేసిన్ లో పెండింగ్ ప్రాజక్టులపై ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశంలో చర్చించనున్నారు. సీఎంల సమావేశం ఎజెండాలోనే  బనకచర్ల ప్రాజక్టును  జలశక్తి మంత్రిత్వాశాఖ చేర్చింది. అయితే ఎజెండా నుంచి బనకచర్లను తొలగించాలని జలశక్తి మంత్రిత్వశాఖకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ఈ  నేపథ్యంలో కేసీఆర్, హరీష్  భేటీపై ప్రాధాన్యత సంతరించుకుంది. బనకచర్లను బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బనకచర్లపై  సీఎం  రేవంత్ రెడ్డి సర్కార్ కు ఏపీకి అనుకూలంగా వ్యవరిస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. బనకచర్లపై కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రత్యక్ష పోరాటానికి బీఆర్ఎస్ సిద్దమవుతున్నట్లుగా  తెలుస్తోంది. ఈ క్రమంలో కేసీఆర్, హరీష్ రావు సమావేశంపై ఆసక్తి సంతరించుకుంది.  

Advertisment
తాజా కథనాలు