మీకు దమ్ము లేదు.. కాంగ్రెస్ లీడర్లపై దీపా దాస్‌ మున్షీ ఫైర్!

GHMC కాంగ్రెస్ లీడర్లపై కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జి దీపా దాస్ మున్షీ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఏ కాంగ్రెస్ లీడర్‌కు దమ్ము లేదని అన్నట్లుగా ప్రచారం సాగుతోంది. పొద్దున కాంగ్రెస్, సాయంత్రం MIM, BRS లో తిరిగే నాయకులు ఉన్నారని అన్నట్లు తెలుస్తోంది.

New Update
Deepdas munshi telangana congress incharge

కాంగ్రెస్‌ నేతలకు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపా దాస్‌ మున్షీ క్లాస్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ లీడర్లపై ఆమె ఫైర్ అయినట్లు సమాచారం. హైదరాబాద్‌లో ఉన్న ఏ కాంగ్రెస్ లీడర్‌కు దమ్ము లేదని మున్షీ అన్నట్లుగా చర్చ జరుగుతోంది. కేటీఆర్, హరీష్‌కు కౌంటర్ ఇవ్వడం మీకు చేతకాదా అని ఆగ్రహం చేసినట్లు ప్రచారం సాగుతోంది. GHMC ఎలక్షన్స్ ప్రిపరేషన్ మీటింగ్‌లో మున్షీ ఈ సంచలన వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ చాలా వీక్‌గా ఉందని ఆమె అన్నట్లు తెలుస్తోంది. మన పార్టీలో పొద్దున కాంగ్రెస్, సాయంత్రానికి ఎంఐఎం నాయకులున్నారని ఆమె ఫైర్‌ అయినట్లు సమాచారం. మరి కొందరు పొద్దున కాంగ్రెస్, సాయంత్రానికి బీఆర్ఎస్ నాయకులేనని కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 
ఇది కూడా చదవండి: సర్పంచ్ ఎన్నికలపై కీలక నిర్ణయం.. ఐదేళ్లకొకసారి రిజర్వేషన్లలో మార్పు

వీహెచ్ పై నేతల ఫైర్..

ఇదిలా ఉంటే.. నిన్న గాంధీభవన్‌లో నిర్వహించిన కాంగ్రెస్ మీటింగ్ రచ్చరచ్చ అయ్యింది. ఆ పార్టీ సీనియర్ నేత వీహెచ్‌ చేసిన వ్యాఖ్యలపై ఓ వర్గం నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముస్లింలు ఎన్నికల వరకు కాంగ్రెస్‌తో ఉండి  పోలింగ్‌ టైంలో హ్యాండిస్తున్నారంటూ వీహెచ్‌ కామెంట్ చేశారు. వీహెచ్‌ కామెంట్స్‌తో ఒక్కసారిగా గాల్లోకి కుర్చీలు లేచాయి. దీంతో ఓ వర్గం నేతలు నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు.దీంతో సమావేశం నుంచి దీపాదాస్‌ మున్షీ ఆగ్రహంతో వెళ్లిపోయారు. ఆమెతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా వెళ్లిపోయారు.
ఇది కూడా చదవండి: ఐపీఎస్‌ అధికారి సంజయ్‌కి బిగ్ షాక్.. మెడకు ఉచ్చు బిగుస్తున్న ఏసీబీ

ఈ నేపథ్యంలోన మున్షీ గ్రేటర్ నేతలపై సీరియస్ అయ్యారన్న చర్చ సాగుతోంది.  గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతా దుమ్ములేపిన కాంగ్రెస్ పార్టీ.. గ్రేటర్ లో మాత్రం వెనకబడింది. గ్రేటర్ పరిధిలోని ఇబ్రహీంపట్నం మినహా.. ఆ పార్టీ అభ్యర్థులు ఎక్కడా విజయం సాధించలేదు. గత పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఇక్కడ అధికార పార్టీకి నిరాశే మిగిలింది. 

ఇది కూడా చూడండి: తానుపారిపోవాలని అనుకోలేదు.. మొదటిసారి స్పందించిన అసద్

ఇది కూడా చూడండి: నా రికార్డ్‌లు కావాలంటే గూగుల్‌లో వెతకండి– బుమ్రా

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు