Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసింది రేవంత్ అనుచరులేనా? ప్రూఫ్స్ తో సహా..!

అల్లు అర్జున్ ఇంటిపై దాడి జరిగిన విషయం తెలిసిందే. దాడి చేసింది రేవంత్ రెడ్డి అనుచరులనని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దాడి చేసిన వాళ్ళు గతంలో రేవంత్ రెడ్డితో దిగిన ఫొటోలను షేర్ చేస్తూ ఇలాంటి చీఫ్ పాలిటిక్స్ ఆపాలని డిమాండ్ చేస్తున్నారు.

New Update
attack on allu arjun house

attack on allu arjun house

అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఘటన పీక్స్ కు చేరింది. నిన్న అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ పై ఆరోపణలు చేయడం ఒకెత్తు అయితే.. అందుకు కౌంటర్ గా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం మరో ఎత్తు. ప్రెస్ మీట్ లో ఘటన జరిగిన టైం లో పోలీసులు తనకు ఏమీ చెప్పలేదని అన్నారు. 

అదే అతని కొంప ముంచింది. బన్నీ చెప్పింది అబద్దం అని, పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ మరీ రిలీజ్ చేసి చెప్పారు. దాంతో సోషల్ మీడియాలో అల్లు అర్జున్ వర్సెస్ రేవంత్ లాగా మారిపోయింది. అయితే తాజాగా OU జేఏసీ ఆధ్వర్యంలో పలువురు అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేశారు. 

ఇది కూడా చదవండి: Pawan kalyan: ఏపీకి రండి.. సినీ పెద్దలకు పవన్ కళ్యాణ్ పిలుపు!

అల్లు అర్జున్ వల్లే రేవంతి చనిపోయింది అంటూ జూబ్లీహిల్స్ లోని అల్లు అర్జున్ ఇంటి ముందు ఆందోళన చేశారు. పలువురు విద్యార్థులు అల్లు అర్జున్ ఇంటి లోపలికి వెళ్ళే ప్రయత్నం కూడా చేసారు. అల్లు అర్జున్ ఇంటిపై టమాటాలు, రాళ్లతో దాడి చేశారు. పలువురు గోడలు ఎక్కి లోపలికి దిగి బౌన్సర్లతో గొడవ పెట్టుకున్నారు.

బౌన్సర్లు అడ్డుకోవడంతో వారిపై కూడా దాడి చేశారు. అల్లు అర్జున్ ఇంట్లో ఉన్న మొక్కల కుండీలు పగలకొట్టారు. రేవతి చావుకు కారణం అల్లు అర్జున్ అని నినాదాలు చేశారు. ఈ దాడి చేసింది OU జేఏసీ విద్యార్థులు కాదని బన్నీ ఫ్యాన్స్ అంటున్నారు. 

Also Read :   రెండు రికార్డులు సృష్టించిన పక్షి.. 74 ఏళ్ల వయసులో ఇదేం విచిత్రం!

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో 'Stop Cheap Politics on allu arjun' అనే హ్యాష్ ట్యాగ్ ఎక్స్ లో ట్రెండ్ అవుతోంది. అల్లు అర్జున్ ను సపోర్ట్ చేస్తూ నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు. వీరిలో కొందరు అల్లు అర్జున్ అభిమానులు.. ఈ రోజు బన్నీ ఇంటిపై దాడి చేసిన వాళ్ళు రేవంత్ రెడ్డి అనుచరులని చెబుతూ.. గతంలో రేవంత్ రెడ్డితో వాళ్ళు దిగిన ఫొటోలను జత చేసి మరీ ఇవే ప్రూఫ్స్ అని పోస్టులు చేస్తున్నారు. 

అంతేకాకుండా అల్లు అర్జున్ పైఅనే  ఇలాంటి చీఫ్ పాలిటిక్స్ ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం 'Stop Cheap Politics on allu arjun' 65 వేలకు పైగా పోస్టులతో ఎక్స్ లో టాప్-1 లో ట్రెండ్ అవుతోంది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు