YS Viveka Murder-SIT: వివేకా హత్య కేసులో రంగంలోకి దిగిన సిట్...వారి మరణాల పై విచారణ!
వైఎస్ వివేకా హత్య కేసులో సిట్ రంగంలోకి దిగింది. ఈ కేసులో అనుమానాస్పదంగా మృతి చెందిన సాక్షుల మరణాలపై సిట్ విచారణ చేపట్టనుంది. పులివెందుల డీఎస్పీ కార్యాలయంలో సిట్ అధికారులు విచారణ మొదలుపెట్టారు.
YS Vivekananda: హత్య కేసులో అంతుచిక్కని ప్రశ్నలెన్నో.. సాక్షులంతా చనిపోతున్నారెలా..?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారిన వైఎస్ వివేకానంద హత్య కేసు ఇంకా కొలిక్కి రాలే. మార్చి 15 నాటికి ఈ మర్డర్ మిస్టరీకి ఆరేళ్లు. హత్య జరిగిందని తెలిసినా.. నేరస్తులెవరో ఇంకా తెలియడం లేదు. సాక్షులు వరసుగా చనిపోతుండటంతో అనేక అనుమానాలు వ్యకమవుతున్నాయి.
అవినాశ్ రెడ్డికి సుప్రీంకోర్టు బిగ్ షాక్.. వివేకా హత్య కేసులో మరో కీలక పరిణామం!
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ కీలక నేత, కడప ఎంపీ అవినాశ్‌రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఇదే కేసులో శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డికి సైతం నోటీసులు జారీ చేసింది.
MP Avinash: వివేకా హత్య.. చీకటి ఒప్పందంతోనే అలా జరిగింది..అవినాష్ సంచలన వ్యాఖ్యలు..!
వైఎస్ షర్మిల, వైఎస్ సునీతా రెడ్డి వ్యాఖ్యలకు ఎంపీ అవినాష్ కౌంటర్ ఇచ్చారు. తాను ఏ తప్పు చేయలేదన్నారు. చీకటి ఒప్పందంతోనే దస్తగిరిని అప్రూవర్ గా మార్చారని అన్నారు. చంద్రబాబు డైరెక్షన్ లోనే సునీతా నడుస్తున్నారా? అని అనుమానం వ్యక్తం చేశారు.
YS Sharmila : వివేకాను చంపింది అవినాష్.. హంతకులకు రక్షగా జగన్ : పులివెందులలో షర్మిల సంచలన కామెంట్స్
వైఎస్ వివేకానందరెడ్డిని గొడ్డలితో నరికి దారుణంగా చంపిన కడప ఎంపీ అవినాష్ రెడ్డిని కాపాడుతున్నది జగన్ అని ఆరోపించారు షర్మిల. ఈ దారుణాలు చూడలేకనే తాను పోటీ చేస్తున్నానన్నారు. పులివెందులలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న షర్మిల జగన్, అవినాష్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు.
YS Viveka Murder Case: వివేక హత్య కేసు.. జగన్ పాత్రపై సునీతారెడ్డి సంచలన వ్యాఖ్యలు!
నాన్న(వివేక)ను గొడ్డలితో చంపారనే విషయం జగనన్నకు ఎలా తెలుసని నిలదీశారు వైఎస్ సునీత. అవినాష్, భాస్కర్ రెడ్డిని అధికారంలో ఉన్నవాళ్లే రక్షిస్తున్నారని.. ఇందులో జగన్ పాత్రపై విచారణ జరగాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిల ఒక్కరే తనకు మొదటి నుంచి అండగా నిలిచారన్నారు.
YS Viveka Murder Case: వివేకా హత్య కేసులో మరో సంచలన మలుపు.. సునీతతో పాటు వారిపై పులివెందులలో కేసు
పులివెందుల పోలీస్ స్టేషన్లో వైఎస్ సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి, సీబీఐ ఎస్పీ రాంసింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. వివేకా హత్య కేసు విషయంలో కొందరి పేర్లు చెప్పాలని వీరు బెదిరించారని వివేకా పీఏ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు వీరిపై కేసు నమోదైంది.