YS Sunita: హోంమంత్రి అనితతో వైఎస్ సునీత భేటీ
ఏపీ హోంమంత్రి అనితను వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీత ఈ రోజు అమరావతిలోని సచివాలయంలో కలిశారు. వివేకా హత్య కేసు విషయంపై వీరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. తనకు న్యాయం దక్కేలా సహకరించాలని హోంమంత్రిని సునీత కోరినట్లు సమాచారం.