/rtv/media/media_files/2025/01/31/uag2sK6bElPs7XEJxTM5.jpg)
gbs
AP New Virus: ఏపీలో గులియన్ బారే(Guillain-Barre) సిండ్రోమ్ (జీబీఎస్) నెమ్మదిగా దేశ వ్యాప్తంగా వ్యాపిస్తోంది. ఈ వ్యాధి క్రమంగా వ్యాపిస్తుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో పదేళ్ల బాలుడు జీబీఎస్ వ్యాధితో చనిపోయిన విషయం తెలియడంతో ప్రజలు గజగజలాడుతున్నారు. తాజగా గుంటూరు జిల్లాలో జీబీఎస్ కలకలం రేపింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏడు కేసులు నమోదయ్యాయి. జీజీహెచ్‌లో జీబీఎస్ బాధితులు చేరారు.
Also Read: మోదీకి ట్రంప్ స్పెషల్ గిఫ్ట్..
వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు జీజీహెచ్ వైద్యులు చెప్పారు. వ్యాధి ఇంతగా వ్యాపిస్తున్న వైద్యశాఖ అప్రమత్తం కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. వైద్యశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.కొన్ని రోజుల క్రితం ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో పదేళ్ల బాలుడు జీబీఎస్ వ్యాధితో చనిపోవడం తీవ్ర కలకలం రేపింది.
Also Read: ఏం మనుషులు రా మీరు...తమ ముందు బుల్లెట్ బండి నడిపాడని రెండు చేతులు నరికేశారు!
విశాఖపట్నంలో చిన్నారి బ్రెయిన్‌డెడ్..
శ్రీకాకుళం, విశాఖపట్నంలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందిన ఆ బాలుడిని ఆ తర్వాత రాగోలులోని జెమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఆ చిన్నారి బ్రెయిన్‌డెడ్ అయినట్లుగా వైద్యులు నిర్ధారించారు. జీబీఎస్ అనేది శరీరంలోని నాడీవ్యవస్థను ప్రభావితం చేసే అరుదైన, తీవ్రమైన నరాల వ్యాధి. ఇదొక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఇది నరాలపై దాడి చేస్తుంది. దీంతో కండరాల బలహీనత, పక్షవాతం, కొన్ని సందర్భాల్లో శ్వాసకోశ వైఫల్యానికి దారితీస్తుంది.
Also Read: వారిని పంపించేడమే కరెక్ట్..ట్రంప్ సరిగ్గానే చేస్తున్నారు..మోదీ
ఈ వ్యాధి సోకడానికి కచ్చితమైన కారణం తెలియదు కానీ.. తరచుగా వైరల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ల వల్ల వస్తుంది. ఇది శరీరంలో వేగంగా అభివృద్ధి చెంది రోగ నిరోధక శక్తిపై దాడిచేస్తుంది. దీనివల్ల శ్వాసకోశ కండరాలు ప్రభావితమైతే.. ఇంటెన్సివ్ కేర్‌లో వెంటిలేషన్‌పై ఉంచి చికిత్స అందించాల్సి ఉంటుంది.
Also Read: ముంబయి దాడుల సూత్రధారి అప్పగింతకు ట్రంప్ అంగీకారం!
మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు సూచించారు. జీబీఎస్ అంటువ్యాధి కాదని ప్రజలకు భరోసానిచ్చారు.