USA: మోదీకి ట్రంప్ స్పెషల్ గిఫ్ట్..

అమెరికా పర్యటన సందర్భంగా ప్రధాని మోదీకి...ట్రంప్ ఒక స్పెషల్ గిఫ్ట్ ను ఇచ్చారు. వైట్ హౌస్ లో తనను కలవడానికి వచ్చిన మోదీకి, ట్రంప్ తానే స్వయంగా రాసిన అవర్ జర్నీ టుగెదర్ ను అనే పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చారు.

New Update
us

Trump Special Gift To PM Modi

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను భారత ప్రధాని మోదీ ఈరోజు కలిశారు. ఇరువురు నేతలూ పలు కీలక విషయాలపై చర్చించుకున్నారు. ట్రంప్ తో పాటూ ఎలాన్ మస్క్ , ఉపాధ్యక్షుడు తదితరులతో సమావేశమయ్యారు ప్రధాని. అమెరికాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన అతిథి గృహంలో ఆయన బస చేశారు.  1651 పెన్సిల్వేనియా అవెన్యూలోని బ్లెయిర్‌ హౌస్‌ ఆయనకు ఆతిథ్యం ఇస్తోంది. ఇది వైట్ హౌస్ కు ఎదురుగానే ఉంటుంది. 

అవర్ జర్నీ టుగెదర్..

తరువాత అధ్యక్షుడు ట్రంప్ ..ప్రధాని మోదీకి వైట్ హౌస్ లో ఆత్మీయ ఆతిధ్యమిచ్చారు. మీటింగ్ అనంతరం ఆయనకు ఒక ప్రత్యేక బహుమతిని కూడా అందజేశారు. తాను స్వయంగా రాసిన ‘అవర్‌ జర్నీ టుగెదర్‌’ అనే పుస్తకాన్ని ట్రంప్ కానుకగా ఇచ్చారు. ట్రంప్ మొదటిసారి ప్రెసిడెంట్ అయినప్పుడు చోటు చేసుకున్న సంఘటనలూ, ప్రధాన ఈవెంట్లతో ఈ పుస్తకం ఉంటుంది. ఇందులో ప్రధాని మోదీ 2019 నాటి అమెరికా పర్యటనలో నిర్వహించిన ‘హౌడీ మోదీ’, ఆ తర్వాత 2020లో ట్రంప్‌ భారత్‌కు విచ్చేసినప్పుడు ఏర్పాటుచేసిన ‘నమస్తే ట్రంప్‌’ కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలు కూడా ఉన్నాయి. దీన్ని ట్రంప్ స్వయంగా తన చేతులతో మోదీకి అందించారు. దాని మీద మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, యూ ఆర్ గ్రేట్ అని రాసి, తన సంతకం చేసి మరీ ట్రంప్ అందించారు. 

అలాగే మోదీకి ఆతిధ్యమివ్వడం గురించి కూడా ట్రంప్ గొప్పగా చెప్పారు. భారత ప్రధానిని తమ గెస్ట్ గా పిలవడం చాలా గౌరవంగా భావిస్తున్నానని ఆయన చెప్పారు. చాలా కాలంగా మోదీ తనకు మంచి మిత్రుడని...తమ ఇద్దరి మధ్యనా మంచి అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు. అలాగే ట్రంప్ గురించి కూడా భారత ప్రధాని మోదీ గొప్పగా చెప్పారు. దేశ ప్రయోజనాలకు అత్యున్నత ప్రాధాన్యమివ్వడం తాను ట్రంప్ దగ్గర నుంచి నేర్చుకున్నానని అన్నారు.  ఇది ఎంతో అభినందించదగ్గ విషయమని చెప్పారు. 

Also Read: USA: వారిని పంపించేడమే కరెక్ట్..ట్రంప్ సరిగ్గానే చేస్తున్నారు..మోదీ
 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు