/rtv/media/media_files/2026/01/11/sankranthi-2026-01-11-09-50-33.jpg)
Sankranthi
సంక్రాంతి పండుగ(sankranti 2026) కోసం నగరవాసులు సొంతూళ్లకు బయలుదేరుతున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్-విజయవాడ రహదారిపై రద్దీ(traffic-jam) కొనసాగుతోంది. పంతంగి టోల్‌ప్లాజా వద్ద ఆదివారం తెల్లవారుజాము నుంచే రద్దీ కొనసాగుతోంది. ఏపీ వైపు వెళ్లే వాహనాలు పెద్దఎత్తున వస్తున్నాయి. దీంతో ఎక్కువ టోల్ బూత్‌లను తెరిచారు. కార్లు, ఇతర వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు ఏకంగా 70 వేల వాహనాలు ఏపీ వైపు వెళ్లినట్లు పంతంగి టోల్ ప్లాజా సిబ్బంది వెల్లడించారు.
Also Read: దారుణం.. 19ఏళ్ల యువతిపై పోలీస్ డ్రైవరే సామూహిక అత్యాచారం
Sankranti Rush At Hyderabad-Vijayawada Highway
టోల్ ప్లాజా వద్ద వాహనాలకు ఫాస్టాగ్ స్కాన్ వేగంగా అయ్యేలా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు టోల్‌ప్లాజాల దగ్గర పెట్రోలింగ్ వెహికిల్, అంబులేన్స్, క్రేన్‌ను అందుబాటులో ఉంచారు. ఇక హైదరాబాద్ నుంచి వస్తున్న వాహనాలతో ఏపీలో నందిగామ వద్ద భారీ ట్రాఫిక్ జామ్ నెలకొంది. అక్కడ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతుండటంతో వై జంక్షన్ వద్ద రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. - Makar Sankranti 2026
Also Read: ఇండియా నేవీ మాస్టర్ ప్లాన్.. చైనా, బంగ్లాదేశ్ ఆటలకు చెక్!
Follow Us