/rtv/media/media_files/2025/05/04/Efr19vTSDD3hWbM3WMS9.jpg)
Roja has encroached on land
AP News : మాజీమంత్రి వైసీపీ నాయకురాలు రోజాపై తెలుగుదేశంపార్టీ అనుబంధ కార్మిక విభాగం నేత ఒకరు భూ ఆక్రమణ ఆరోపణలు చేశారు. ఈ విషయమై తనకు న్యాయం చేయాలని కోరుతూ మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో శనివారం ఫిర్యాదు చేశారు.
ఇది కూడా చూడండి: కాంగ్రెస్ MLAలపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఫైర్.. అన్నీ నేనే మాట్లాడాలా..?
ఈ మేరకు చిత్తూరు జిల్లా విజయపురం మండలం కలింబాకకు చెందిన టీఎన్‌టీయుసీ నేత గుణశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ మానాన్న నగరికొంగ సమీపంలోని జ్యోతినగర్‌లో 1982లో ఒక స్థలం కొన్నారు. దాన్ని మాజీమంత్రి రోజా, ఆమె భర్త సెల్వమణి, నగరి పురపాలక సంఘం ఛైర్మన్‌లో కలిసి మీనాకుమార్ అనే వ్యక్తి కబ్జా చేశారు. ఆ స్థలంలో రేకుల షెడ్ వేశారు. ఈ విషయమై నేను పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులను సైతం ప్రలోభ పెట్టి వారితో నన్ను వేధిస్తున్నారు. మరో వైపు ఆర్డీవో, తహసీల్దార్‌కు అనేకసార్లు ఫిర్యాదు చేసినా వారు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు’ అని ఆయన తన ఫిర్యాదులో పేర్కొ్న్నారు.
ఇది కూడా చూడండి: రూల్స్ మాకేనా, మీకు లేవా? పోలీస్ వాహనాలపై రూ.68 లక్షల చలాన్లు
కాగా గత వైసీపీ పాలన హయాంలో ఇబ్బందులు పడ్డ పలువురు బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శనివారం మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయం వద్ద క్యూ కట్టారు. బాధితుల నుంచి ఏపీ బయోడైవర్సిటీ బోర్డు ఛైర్మన్ నీలాయపాలెం విజయ్‌కుమార్ ఫిర్యాదులు స్వీకరించారు. తన భవనాన్ని అక్రమంగా కూల్చిన వారిపై చర్యలు తీసుకోవాలని అన్నమయ్య జిల్లా ములకలచెరువుకు చెందిన రమణమ్మ ఫిర్యాదు చేశారు. తన స్థలాన్ని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని.. ఈ మేరకు అధికారుల్ని ఆదేశించాలని పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం నడికుడికి చెందిన కొప్పుల నరసింహారావు కోరారు. 2014-19 మధ్య గ్రామంలో చేసిన పలు అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు మంజూరు చేయాలని ప్రకాశం జిల్లా పెద్దారవీడుకు చెందిన తిరుమలయ్య యాదవ్ వినతిపత్రం సమర్పించారు. ఇలా అనేకమంది తమ సమస్యలు చెప్పుకునేందుకు మంగళగిరికి తరలివచ్చారు.
ఇది కూడా చూడండి: డేంజర్ జోన్‌లో లక్షా యాభైవేల మంది విద్యార్థులు.. పట్టించుకోని యాజమాన్యాలు!
ఇది కూడా చూడండి: హైదరాబాద్ లో దొంగల బీభత్సం.. అద్దె కోసం వచ్చి ఇళ్లు గుల్ల..!