B Srinivasa Varma: ఢిల్లీలో కారు యాక్సిడెంట్.. కేంద్రమంత్రికి తప్పిన పెను ప్రమాదం!
కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మకు పెను ప్రమాదం తప్పింది. లోక్సభ సమావేశానికి హాజరైన అనంతరం మంత్రిత్వ శాఖ కార్యాలయానికి వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న మరో కారు ఢీ కొట్టింది. దీంతో కాలికి గాయమైంది.