/rtv/media/media_files/2025/03/04/sB7THHGEt1UxkZ2fpnVF.jpg)
praksham crime news
AP Cirme: ప్రకాశం జిల్లా నల్లగుంట్ల గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మొహరం పండుగ ఉత్సవాల సందడిలో గ్రామ ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటుండగా.. ఒక భయానక సంఘటన గ్రామాన్ని వణికించింది. పాతకక్షలు కారణంగా వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని ప్రత్యర్థులు అత్యంత దారుణంగా గొడ్డలితో నరికి హత్య చేశారు. పండుగ వాతావరణంలో జరిగిన ఈ సంఘటన అక్కడి వారిని దిగ్భ్రాంతికి గురిచేసింది.
Also Read : సింహాద్రి అప్పన్న ఆలయంలో అపశ్రుతి
పాతకక్షలతో వ్యక్తి దారుణ హత్య..
స్థానిక వివరాల ప్రకారం.. మూడేళ్ల క్రితం జరిగిన మరో హత్యకేసుతో ఈ ఘటనకు సంబంధం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అప్పట్లో నల్లగుంట్ల సర్పంచ్ మొద్దు రమణమ్మ భర్తను దుండగులు హత్య చేసిన కేసులో వెంకటేశ్వర్లు ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అప్పటి నుంచే ఈ ఘటనపై గ్రామంలో రగిలిన కక్షలు ఇప్పటివరకు శాంతించలేదు. పండుగ సందర్భంగా వెంకటేశ్వర్లు గ్రామంలో తిరుగుతుండగా అతనిపై రమణమ్మ అనుచరులు కాపుకాచి దాడికి తెగబడ్డారు. గొడ్డలితో నరికి అతన్ని హతమార్చారు.
ఇది కూడా చదవండి: అనారోగ్యానికి గురి కావొద్దు అంటే ఈ 7 వస్తువులు వర్షాకాలంలో తినాలి
ఈ హత్య వెనుక రాజకీయ కోణం ఉందా? అనే అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయి. సర్పంచ్ భర్త హత్య కేసులో నిందితుడిగా ఉన్న వెంకటేశ్వర్లుపై ఇలా పగ తీర్చుకున్న తరహాలో దాడి జరగడం రాజకీయ ప్రత్యర్థుల కుట్రగా భావించవచ్చు. అయితే ఇది పూర్తిగా పాతకక్షల ఫలితమా? లేక అప్పటి రాజకీయ శత్రుత్వానికి కొనసాగింపేనా? అన్న విషయంపై పోలీసు శాఖ దర్యాప్తు కొనసాగిస్తోంది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి మృతుడి కుటుంబం సభ్యులు కోరుతున్నారు.
ఇది కూడా చదవండి:డాక్టర్ చెప్పిన ఈ చిట్కాలతో చిన్నపాటి వ్యాధులను ఎదుర్కోవచ్చు
ఇది కూడా చదవండి: కాకరకాయ గింజలు ఆరోగ్యానికి మేలు చేస్తాయా లేక హాని కలిగిస్తాయా తెలుసుకోండి
Latest News | ap-crime-report | ap-crime-news | ap crime updates | ap crime latest updates | AP Crime