కోడి కూర ఉచితం అనడంతో చికెన్ కొనేందుకు, తినేందుకు భయపడ్డ వారంతా వేల సంఖ్యలో ఒక్కసారిగా ఎగబడ్డారు. చికెన్ బిర్యానీ, కోడి కూర, చికెన్ రోస్ట్, ఉడికించిన కోడి గుడ్లు.. తిన్నోళ్లకు తిన్నంత ఫ్రీ అనగానే సగం నగర జనాభా అక్కడ వాలిపోయింది. గుంటూరు పట్టాభిపురంలోని స్వామి థియేటర్ వద్ద ఏపీ పౌల్ట్రీ ఫార్మర్స్ ఫెడరేషన్, గుంటూరు జిల్లా పౌల్ట్రీ ఫార్మర్స్, ట్రేడర్స్ అసోసియేషన్ శుక్రవారం చికెన్ మేళా నిర్వహించింది. దీని గురించి సుమారు నాలుగు రోజుల నుంచి సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేయడంతో శుక్రవారం జరిగిన చికెన్ బిర్యానీ, చికెన్ మేళాకు ఒక్కసారిగా నగర వాసులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
Also Read: Trump-Musk:మస్క్ కుమారుడి అల్లరి వల్ల 145 సంవత్సరాల డెస్క్ మార్చేసిన ట్రంప్!
చికెన్, బిర్యానీ ఉందని మైకులో...
ఎంత మంది వచ్చినా చికెన్, బిర్యానీ ఉందని మైకులో చేపినప్పటికీ ప్రజలు ఓపిక పట్టలేదు, త్వరగా ఫుడ్ పెట్టాలని తోపులాట జరిగే పరిస్థితి అక్కడ కనిపించడంతో నిర్వాహకులు అప్రమత్తం అయ్యారు. జనం తాకిడి తట్టుకోలేక నిర్వాహకులు గేటు మూసివేశారు. ఉచిత చికెన్ ప్రచారంతో స్వామి థియేటర్ వద్దకు మాంస ప్రియులు, చికెన్ లవర్స్ పెద్ద ఎత్తున తరలివచ్చారు.
Also Read: Punjab: 405 రోజులు... 10 దేశాలు... 41 లక్షల రూపాయలు.. చేరిన గమ్యం.. కానీ అంతలోనే!
పట్టాభిపురం పోలీసులు వారిని నియత్రించడాలని చూసినా ప్రయోజనం లేకపోయింది. ఆ స్థాయిలో గుంటూరు ప్రజలు చికెన్ మేళాకు తరలివచ్చారని స్థానికులు చెబుతున్నారు. జనాలను కంట్రోల్ చేయలేక గేట్లు మూసివేయడంతో కొందరు నిర్వాహకులతో గొడవకు దిగారు. మరోవైపు లోపల సైతం వడ్డించే వారితో కొందరు వాగ్వాదానికి దిగినట్లు సమాచారం.
ఈ చికెన్ మేళాలో ప్రజా ప్రతినిధులు, డాక్టర్లు, ట్రేడర్స్ పాల్గొన్నారు. సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. గత కొన్నిరోజులుగా బర్డ్ ఫ్లూ భయంతో చికెన్, కోడి గుడ్లు తినడం మానేశారు. అయితే బాగా ఉడికించిన చికెన్, గుడ్లు తింటే ఏ ప్రమాదం లేదని తెలియజేశారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ మాట్లాడుతూ బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ అమ్మకాలు తగ్గాయి. కానీ ఏ భయం లేకుండా ఉడికించిన కోడిగుడ్లు, చికెన్ తినవచ్చునని.. ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని పేర్కొన్నారు.
భాష్యం ఎడ్యుకేషన్ గ్రూప్ అధినేత రామకృష్ణ, డాక్టర్లు నిమ్మల శేషయ్య, రాయపాటి మమత, ఏపీ పెడరేషన్ ఛైర్మన్ సురేష్, గుంటూరు పౌల్ట్రీ ఫార్మర్స్, ట్రేడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కిశ్‌ర్‌బాబు, వెంకాబ్ అసోసియేషన్ అధ్యక్షుడు బుచ్చారావు, తదితరులు పాల్గొన్నారు.బర్డ్ ఫ్లూ భయంతో ఏపీ, తెలంగాణలో చికెన్ విక్రయాలు సగానికి సగం పడిపోయాయి. చికెన్ తింటే అనారోగ్యం బారిన పడతామన్న భయంతో కొన్ని రోజుల నుంచి చాలా మంది చికెన్ వైపు కన్నెత్తి చూడడం లేదు. ఈ క్రమంలో బర్డ్ ఫ్లూపై అవగాహన కల్పించేందుకు ట్రేడర్స్ అసోసియేషన్ ఉచిత చికెన్ మేళా నిర్వహించింది.
Also Read:Viral News:రిసెప్షన్‌కు ముందు బ్యూటీపార్లర్‌కు వెళ్లొస్తానని..ప్రియుడితో జంప్ అయిన నవవధువు!
Also Read: Maha Kumbh Mela: కుంభమేళాలో డిజిటల్ స్నానం...కేవలం 1100 లే..అదిరిపోయింది కదా ఐడియా!