Xiaomi Sale 2025: దీపావళికి షియోమి బంపర్ సేల్.. స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, పవర్‌బ్యాంక్స్‌పై కిర్రాక్ ఆఫర్లు..

షియోమీ తన "Diwali With Mi" సేల్ 2025ను ప్రకటించింది. ఈ సేల్ సెప్టెంబర్ 22 నుండి ప్రారంభమవుతుంది. స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు, స్మార్ట్ హోమ్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు ఉంటాయి. కొత్త రెడ్‌మీ నోట్ 14 సిరీస్, షియోమీ 14 సివీ ఫోన్‌లపై తగ్గింపు పొందొచ్చు.

New Update
Diwali Xiaomi Sale 2025

Diwali Xiaomi Sale 2025

దసరా, దీపావళి పండుగలు త్వరలో సమీపిస్తు్న్నాయి. ఈ క్రమంలో పలు కంపెనీలు వినియోగదారులను అట్రాక్ట్ చేసేందుకు తమ ప్రొడెక్టులపై భారీ ఆఫర్లు, తగ్గింపులు ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ప్రొడెక్టుల తయారీ కంపెనీ Xiaomi ఇండియా అదిరిపోయే సేల్‌ను తీసుకువస్తోంది. Xiaomi Sale 2025 సెప్టెంబర్ 22 నుండి ప్రారంభం అవుతుంది. ఇందులో స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్ టీవీలు, టాబ్లెట్‌లు, ఫ్యాషన్, పవర్ బ్యాంకులు, ఎయిర్ ప్యూరిఫైయర్‌లపై భారీ తగ్గింపులతో సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్‌లో వినియోగదారులు దాదాపు 60% వరకు డిస్కౌంట్ పొందవచ్చు. Redmi Note 14 సిరీస్, Xiaomi Pad 7, Redmi Watch 5 Lite వంటి మోడళ్లపై భారీ తగ్గింపులు పొందవచ్చు.

Xiaomi Diwali Sale 2025

Xiaomi Sale 2025లో Redmi Note 14 Pro+ పై భారీ ఆఫర్ అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.34,999 ఉండగా.. ఇప్పుడు ఈ సేల్‌లో కేవలం రూ.24,999కి అందుబాటులో ఉంటుంది. అంటే రూ.10,000 భారీ తగ్గింపు లభిస్తుందన్నమాట. 

అలాగే Redmi Note 14 Pro 5G మొబైల్‌ను రూ.20,999లకి కొనుక్కోవచ్చు. Redmi 14C స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.8,999కి అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా Redmi 15, Redmi Note 14 SE స్మార్ట్‌ఫోన్స్ రూ.7,000 వరకు తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి.

స్మార్ట్‌ఫోన్‌లతో పాటు.. టాబ్లెట్, టీవీలపై కూడా భారీ తగ్గింపు లభిస్తుంది. Xiaomi Pad 7పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.34,999 ఉండగా.. ఇప్పుడు Xiaomi Sale 2025లో కేవలం రూ. 22,999లకే సొంతం చేసుకోవచ్చు. అంటే ఈ ప్యాడ్‌పై దాదాపు రూ. 12,000 ఆదా అవుతుంది. 

షావోమీ క్యూఎల్ఈడీ టీవీలు: 4కే క్యూఎల్ఈడీ టీవీలపై రూ. 10,000 వరకు తగ్గింపు లభిస్తోంది. అలాగే, కొత్త జీఎస్‌టీ రేట్ల కారణంగా టీవీల ధరలు మరింత తగ్గుముఖం పట్టాయి.

షావోమీ స్మార్ట్ టీవీ ఎక్స్ సిరీస్: 43, 50, మరియు 55 అంగుళాల మోడల్స్‌పై రూ. 6,000 వరకు డిస్కౌంట్ ఉంది.

చిన్న సైజు టీవీలు: 32 అంగుళాల షావోమీ స్మార్ట్ టీవీలు రూ. 12,000 లోపు ధరలకు అందుబాటులోకి వచ్చాయి.

అంతేకాకుండా Redmi Pad SE 4G పై దాదాపు 50% తగ్గింపును పొందవచ్చు. ఇక టీవీల విషయానికొస్తే.. Xiaomi CineMagiQLED X Pro సిరీస్ అసలు ధర రూ.44,999 ఉండగా ఇప్పుడు Xiaomi Sale 2025లో రూ. 25,999కి లభిస్తుంది. అంటే దాదాపు రూ.19,000 ఆదా చేసుకోవచ్చు. అదేవిధంగా FantastiQLED FX Pro సిరీస్‌లో కూడా రూ. 23,000 వరకు ఆదా అవుతోంది.

ఈసారి డీల్స్‌లో స్మార్ట్‌వాచ్‌లపై భారీ డిస్కౌంట్‌లు పొందవచ్చు. Redmi Watch 5 Lite ను సగం ధరకే కొనుగోలు చేయవచ్చు. Redmi Buds 5C, Buds 6 కూడా దాదాపు సగం ధరకే లభిస్తాయి. పవర్ బ్యాంకులపై రూ.3,300 వరకు తగ్గింపు లభిస్తుంది. Xiaomi స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ 4 లైట్, గ్రూమింగ్ కిట్ కూడా ఆఫర్‌లలో అత్యంత తక్కువకే లభిస్తాయి. 

అలాగే ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డులతో (EMI లావాదేవీలు కూడా) కస్టమర్లు రూ.5,000 వరకు అదనంగా ఆదా చేసుకోవచ్చు. నో-కాస్ట్ EMI, జీరో డౌన్ పేమెంట్ ఆప్షన్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ ఆఫర్లు mi.com, Amazon, Flipkart, ఆఫ్‌లైన్ Xiaomi రిటైల్ స్టోర్‌లలో అందుబాటులో ఉన్నాయి. 

Advertisment
తాజా కథనాలు