CM Reavnth Reddy : కేసీఆర్, ట్రంప్ ఒక్కటే.. సీఎం రేవంత్ సంచలన కామెంట్స్

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో పోల్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలో జరిగిన ఇన్వెస్టర్ల సదస్సులో రేవంత్ మాట్లాడుతూ..  తెలంగాణలో గతంలో ఓ ట్రంప్ ఉండేవాడన్నారు.

New Update
kcr and revanth

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో పోల్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలో జరిగిన ఇన్వెస్టర్ల సదస్సులో రేవంత్ మాట్లాడుతూ..  తెలంగాణలో గతంలో ఓ ట్రంప్ ఉండేవాడు..  ప్రజలు ఆ ట్రంప్‌ను పక్కనపెట్టారని వ్యాఖ్యానించారు. నియంతలా వ్యవహరించే ఎవరినైనా ప్రజలు తిరస్కరిస్తారంటూ రేవంత్ అభిప్రాయపడ్డారు. రాత్రి ఆలోచన రాగానే ఉదయం ఉత్తర్వులు జారీ చేసే పాలన గతంలో సాగిందని సీఎం ఆరోపించారు.

అలాంటి పాలన ఎక్కువకాలం ఉండదు 

అలాంటి పాలన ఎక్కువకాలం ఉండదని చెప్పుకొచ్చారు సీఎం రేవంత్. ట్రంప్‌ నిరంకుశ నిర్ణయాల కారణంగా USలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంస్థలు..  అమెరికాను వదిలి తెలంగాణకు రావాలని రేవంత్ పిలుపునిచ్చారు.  హార్వర్డ్,  స్టాన్ఫోర్డ్  సంస్థలతో మాట్లాడుతానని అన్నారు రేవంత్.. తెలంగాణలో అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. తాము ప్రజాస్వామ్యబద్ధమైన, పెట్టుబడిదారులకు అనుకూలమైన పాలనను అందిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. రేవంత్ చేసిన ఈ కామెంట్స్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. 

Advertisment
తాజా కథనాలు