టార్గెట్ అల్లు అర్జున్.. విజయనగరం టూర్ లో పవన్ సంచలన వ్యాఖ్యలు!

ఇవాళ విజయనగరం జిల్లాలో పర్యటించిన పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. హీరోలకు జేజేలు కొట్టండి కానీ.. మీ జీవితాలపై దృష్టి పెట్టండి అని పేర్కొన్నారు. అల్లు అర్జున్‌ను ఉద్దేశించే పవన్ ఈ వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. 

New Update
allu arjun (5)

allu arjun (5) Photograph: (allu arjun (5))

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ ఇవాళ విజయనగరం జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని గిరిజన గ్రామాల్లో పర్యటించారు. ఈ మేరకు విజయనగరం జిల్లా బాగుజోలలో పర్యటించిన పవన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పవన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ మాట్లాడుతూ.. తన జీవితంలో ఈర్ష్య ఉండదని అన్నారు.

Also Read :  వర్షాన్ని సైతం లెక్కచేయని పవన్ కళ్యాణ్.. చెప్పులు లేకుండా పాదయాత్ర!

Pawan Kalyan Sensational Comments On Allu Arjun

Also Read :  ఆఫర్ అదిరిందిగా..! ఐఫోన్ ఇంత తక్కువ ధరలోనా..?

ఎవరైనా తన కంటే ఎత్తుకు ఎదిగినా.. విజయం సాధించినా అసూయ ఉండదని తెలిపారు. అనంతరం షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. అనంతరం అభిమానులకు చురకలు పెట్టారు. తనను పని చేసుకోనివ్వండని.. తాను బయటికొస్తే తన మీద పడిపోతే తాను ఏ పని చేయలేనని అన్నారు. 

అలాగే OG OG అని అరిస్తే పనులు జరగవని అన్నారు. ఇక సీఎం సీఎం అంటారు.. డిప్యూటీ సీఎం అయ్యాను కదా అని తెలిపారు. హీరోలకు జేజేలు కొట్టండి కానీ.. మీ జీవితాలపై దృష్టి పెట్టండి అని పవన్ పేర్కొన్నారు.  ‘‘సినిమాల మోజులో పడి హీరోలకు జేజేలు కొట్టి మీ జీవితంలో బాధ్యతలు మర్చిపోతున్నారన్నారు’’. అని అన్నారు.

మాట్లాడితే మీసం తిప్పు, మీసం తిప్పు అంటారని.. అయితే మీసం తిప్పితేనో, ఛాతిలు కొట్టుకుంటేనో పనులు జరగవు అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. దీంతో పవన్ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. అల్లు అర్జున్‌ను ఉద్దేశించే పవన్ ఈ వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. 

Also Read :  టార్గెట్ అల్లు అర్జున్.. విజయనగరం టూర్ లో పవన్ సంచలన వ్యాఖ్యలు!

ఇదిలా ఉంటే మరోవైపు గిరిజన ప్రజలు మరిన్ని విషయాలు చెప్పారు. అధికారం లేనప్పుడు తిరిగాం.. అప్పుడు కన్నీళ్లు తుడిచిపోయాం అన్నారు. అప్పుడు గిరిజన ప్రజలకు మాట ఇచ్చానని.. ఇక రెండు నెలలకు ఒకసారి మన్యంలో తిరుగుతానని తెలిపారు. గిరిజన ప్రజలకు, పెద్దలకు, యువతకు, ఆడబిడ్డలకు ఒకటే చెబుతున్ననని.. ఇక నుంచి ఒళ్లు వంచి పనిచేస్తానని అన్నారు. 

రూ.36.71 కోట్ల వ్యయంతో రోడ్డు పనులు

ఇక సాలూరు నియోజకవర్గం, మక్కువ మండలం, పనసభద్ర పంచాయతీలో రోడ్ల నిర్మాణానికి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. 55 గిరిజన ప్రాంతాలను కలిపేలా రూ.36.71 కోట్ల వ్యయంతో 39.32 కి.మీ మేర రోడ్ల నిర్మాణానికి పునాది వేశారు. ఇది పూర్తి కాగానే 3,782 మంది గిరిజనుల డోలీ కష్టాలు తీరనున్నాయి. అలాగే బాగుజోల గ్రామం నుంచి సిరివర వరకు రూ.9.50 కోట్ల వ్యయంతో 9 కి.మీ మేర తారు రోడ్డుగా మార్చుతున్నామన్నారు. 

Also Read :  పుష్ప-2 సెట్ లో కొరియోగ్రాఫర్ శ్రష్టీ బర్త్ డే సెలబ్రేషన్స్.. వీడియో వైరల్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు