వర్షాన్ని సైతం లెక్కచేయని పవన్ కళ్యాణ్.. చెప్పులు లేకుండా పాదయాత్ర! ఇచ్చిన మాట కోసం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ నిలబడ్డారు. ఇవాళ మన్యం పార్వతీపురం జిల్లాలో పర్యటించారు. వాతావరణం అనుకూలించక పోయినా.. చిరుజల్లులు తడిపేస్తున్నా లెక్కచేయలేదు. కాలినడకన చెప్పులు లేకుండా బాగుజోల గ్రామానికి వెళ్లారు. By Seetha Ram 20 Dec 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి 1/8 ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ మన్యం పార్వతీపురం జిల్లాలో పర్యటించారు. 2/8 ఆయనకు గిరిజన ప్రజలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. వాతావరణం అనుకూలించక పోయినా.. చిరుజల్లులు తడిపేస్తున్నా లెక్కచేయలేదు. 3/8 డోలీ మోతల కాలం చెల్లాలనే లక్ష్యంతో పవన్ మన్యంలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గిరిజన గ్రామంలోని పరిస్థితులు చూసి చలించిపోయారు. 4/8 ఈ మేరకు మక్కువ మండలంలోని గిరిజన గ్రామం బాగుజోలలో రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గిరిజన గ్రామాల్లో డోలీల బాధలు ఉండకూడదు అనే లక్ష్యంతో రహదారుల నిర్మాణానికి పునాది వేశారు. 5/8 దాదాపు 55 గిరిజన ప్రాంతాలను కలిపేలా రూ.36.71 కోట్ల వ్యయంతో.. 39.32 కి.మీ మేర రహదారుల నిర్మాణానికి పునాది వేశారు. 6/8 ఈ రోడ్ల నిర్మాణంతో 3782 మందికి డొలీల బాధల నుండి విముక్తి కల్పించనున్నారు.ఈ సందర్భంగా గ్రామస్తులతో ఆత్మీయంగా మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. 7/8 రెండు నెలలకొక సారి మన్యంలో తిరుగుతానని.. గిరిజన బిడ్డలకు, యువతకు, పెద్దలకు ఒకటే మాట చెబుతున్నా.. ఒళ్లు వంచి పని చేస్తానని పవన్ పేర్కొన్నారు. 8/8 ఇదిలా ఉంటే పవన్ కాలినడకన చెప్పులు లేకుండా బాగుజోల గ్రామానికి వెళ్తున్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. #manyam #vizayanagaram #pawan-kalyan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి